- Telugu News Photo Gallery Who is richest south Indian film Actress? Anushka Shetty Nayantara Pooja Hegde Rashmika Mandanna Samantha
Richest Actress of South: అత్యంత సంపన్నురాలైన దక్షినాది హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? టాప్ 6 నటీమణుల జాబితా మీ కోసం..
బాలీవుడ్‌లోని చాలా మంది హీరోయిన్లను మించిన సంపన్నలు నటీమణులు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఉన్నారు. వారిలో కొందరు దేశంలోని అగ్ర నటీమణులుగా కూడా కొనసాగుతున్నారు. మరి వారందరిలో టాప్ 5 సంపన్న లేదా ధనవంతులైన హీరోయిన్లెవరో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 04, 2023 | 5:04 PM

సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యంత సంపన్న నటి జాబితాలో నయనతార పేరు మొదటి స్థానంలో ఉంది. నయనతార ఆస్తుల విలువ దాదాపు రూ.165 కోట్లు. 2003లో మనసినక్కరే అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన నయనతార తెలుగు, మలయాళ భాషల్లో అద్భుతమైన చిత్రాలలో నటించింది.

నయనతార తర్వాతి స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నా 110 కోట్ల విలువైన ఆస్తులతో రెండో స్థానం ఉంది. 15 ఏళ్ల వయసులోనే ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన తమన్నా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది.

దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటీమణుల జాబితాలో అనుష్క శెట్టి పేరు మూడో స్థానంలో ఉంది. అనుష్క శెట్టి ఆస్తుల విలువ 100 కోట్లు. బాహుబలి, బాహుబలి 2 వంటి భారీ చిత్రాలలో నటించిన అనుష్క శెట్టిని జేజమ్మ అని కూడా పిలుస్తుంటారు ఆమె ఆభిమానులు.

సమంత పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఇటీవలే పుష్ప ది రైజ్ సినిమాలో ‘ఊ అంటావా..’ అంటూ కుర్రకారును ఉర్రూతలూరించిన సమంత ఆస్తుల విలువ 89 కోట్లు. దీంతో ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాలుగో సంపన్న నటీమణిగా ఉంది.

దక్షిణాదికి చెందిన మరో ధనిక నటి పూజా హెగ్డే. పూజా హెగ్డే ఆస్తుల విలువ 50 కోట్లు కావడంతో దక్షిణాది ధనిక నటీమణుల జాబితాలో ఆమె ఐదో స్థానంలో ఉంది. పూజా హెగ్డే హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్నా కూడా ఈ జాబితాలో ఉంది. 28 కోట్ల విలువైన ఆస్తులను కలిగిన రష్మిక త్వరలోనే బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించబోతోంది.





























