- Telugu News Entertainment Tollywood Allu Arjun Daughter Allu Arha Will Act In Mahesh Babu And Trivikram Movie telugu cinema news
Allu Arha: మరో ప్రాజెక్ట్‌లో అలరించనున్న అల్లు అర్జున్ తనయ.. బాలనటిగా బిజీ కాబోతున్న అర్హ.. ఏ సినిమాలో అంటే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలకు.. అల్లరికి ఎంతో మంది అభిమానులున్నారు. అర్హకు సంబంధించిన ఏ చిన్న ఫోటో అయినా క్షణాల్లో వైరలవుంటాయి. అంతగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Updated on: Jan 04, 2023 | 2:07 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలకు.. అల్లరికి ఎంతో మంది అభిమానులున్నారు. అర్హకు సంబంధించిన ఏ చిన్న ఫోటో అయినా క్షణాల్లో వైరలవుంటాయి. అంతగా ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అర్హకు సంబంధించిన ప్రతి చిన్న ఫోటోస్.. వీడియోస్ వాళ్ల మథర్ బన్నీ సతీమణి అల్లు స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలాగే బన్నీ కూడా తన కూతురు అల్లరి వీడియోస్ అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటారు.

ఇక సమంత నటిస్తోన్న శాకుంతలం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది అల్లు అర్హ. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే తాజాగా అర్హ మరో ప్రాజెక్ట్‌లోనూ కనిపించనుందట. సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో అర్హ ఓ పాత్రలో కనిపించనుందట.

మహేష్ సినిమాలోనూ అర్హ నటిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్, మహేష్ బన్నీని అడగ్గా ఆయన ఓకే చేశారుని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది

అర్హ ఇప్పటికే సోషల్ మీడియా సూపర్ స్టార్. అర్హ కు సంబంధించిన అల్లరి పనులను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు .

Allu Arha: మరో ప్రాజెక్ట్‌లో అలరించనున్న అల్లు అర్జున్ తనయ.. బాలనటిగా బిజీ కాబోతున్న అర్హ.. ఏ సినిమాలో అంటే..