Praveena: నన్నూ.. నా కూతురిని అతను వేధిస్తున్నాడు.. పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ నటి
ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురవుతున్నారు. కొందరు తమ ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారంటూ వాపోయిన సందర్భాలు కోకొల్లలు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదై పోయింది. అయితే సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందొ అంతే నష్టం కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురవుతున్నారు. కొందరు తమ ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారంటూ వాపోయిన సందర్భాలు కోకొల్లలు. చిన్న చిన్న ఆర్టిస్ట్ ల దగ్గర నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు చాలా మంది సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురైన వార్తలు మనం చూశాం.. తాజాగా మరో నటి కూడా ఇలాంటి వేదింపులకు గురవుతుంది. గతంలో తనను వేధించిన కీచకుడు ఇప్పుడు తన కూతురిని కూడా వేదిస్తున్నాడంటూ పోలీసుల దగ్గర వాపోయింది. ఇంతకు ఆ నటి ఎవరంటే..
ప్రముఖ నటి ప్రవీణా పోలీసులను ఆశ్రయించింది. తనను గతకొంతకాలంగా ఒకడు వేదిస్తున్నడని.. ఇప్పుడు అతనే తన కూతురిని కూడా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఢిల్లీకి చెందిన భాగ్యరాజ్ అనే విద్యార్థి కొంతకాలంగా ప్రవీణను వేధిస్తున్నాడు. ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్స్ లో షేర్ చేశాడు. దీని పై అప్పుడే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలులో కూడా పెట్టారు. ఇక ఇప్పుడు అతను బయటకు వచ్చి మరోసారి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
ప్రవీణతో పాటు తన కూతురి గైరీ నాయర్ ను కూడా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. తన కూతురి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, పలు వెబ్ సైట్స్ లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సుమారు 100 ఫేక్ అకౌంట్స్ తో అతడు తనవి, తన కూతురివి ఫోటోలు షేర్ చేశాడని ప్రవీణ ఫిర్యాదు చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..