Nayanthara: నయనతారకు ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చిన విఘ్నేశ్.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్యపోతారు
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార మంగళవారం (నవంబర్ 18) తన పుట్టిన రోజును సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంది. అయితే తన పుట్టిన రోజు కానుకగా భర్త డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ నుంచి నయన్ కు చాలా ఖరీదైన గిఫ్ట్ వచ్చింది.

40 ఏళ్లలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది నయనతార. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ రోల్స్ చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో యాక్ట్ చేస్తోందీ లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మన శివశంకర వరప్రసాద్, నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా, అలాగే కేజీఎఫ్ ఫేమ్ యష్ తో టాక్సిక్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది నయన్. అసలు విషయానికి వస్తే.. మంగళవారం (నవంబర్ 18) నయనతార పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, సినీ అభిమానులు లేడీ సూపర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే ఆమె నటిస్తోన్న సినిమా అప్డేట్స్ కూడా వచ్చాయి. కాగా ఈసారి నయన్ తన పుట్టినరోజుని సింపుల్‌గా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. అయితే పుట్టిన రోజు కానుకగా భర్త విఘ్నేశ్ నుంచి చాలా ఖరీదైన గిఫ్ట్ వచ్చింది.
నయనతార, విఘ్నేశ్ శివన్ లది ప్రేమ వివాహం. 2022లో పెళ్లిపీటలెక్కిన ఈ దంపతులకు ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లైనప్పటి నుంచి ప్రతిసారి నయన్ పుట్టినరోజుకి విఘ్నేశ్ ఖరీదైన కార్లని బహుమతిగా ఇస్తున్నాడు. అలా 2023లో రూ.3 కోట్లు ఖరీదు చేసే మెర్సిడెజ్ మేబాచ్, 2024 గతేడాది రూ.5 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ మేబాచ్ జీఎల్ఎస్ 600 కారుని నయన్ కు బర్త్ డే కానుకగా ఇచ్చాడు విఘ్నేశ్. అయితే ఈ సారి మాత్రం 10 కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు.
కొత్త రోల్స్ రాయిస్ తో నయనతార ఫ్యామిలీ..
View this post on Instagram
ఈ మేరకు రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్ర కారుతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నయనతార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విఘ్నేశ్ కి నయనతార అంటే ఎంత ప్రేమో! అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
భర్త, పిల్లలతో లేడీ సూపర్ స్టార్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








