Samantha Marriage: సమంత- రాజ్ నిడిమోరు పెళ్లి.. వేణు స్వామి ఏమన్నారో తెలుసా? వీడియో ఇదిగో
సమంత- నాగ చైతన్య ఇష్యూతోనే బాగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఆ తర్వాత నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహ సమయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారీ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్. మరి ఇప్పుడు సమంత రెండో పెళ్లి పై వేణు స్వామి ఏమన్నారో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోర్ అధికారికంగా పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ వేదికగా మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారీ ప్రేమ పక్షులు. అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో సోమవారం (డిసెంబర్ 02) సామ్- రాజ్ ల వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతన్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే సమయంలో సామ్- రాజ్ పెళ్లిపై కొందరు సెలబ్రిటీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ కౌర్ లాంటి సినీ తారలు సామ్ రెండో పెళ్లిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గతంలో ఇదే సమంత ఇష్యూతోనే బాగా పాపులర్ అయిన వేణు స్వామి ఇప్పుడు ఏమంటారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సామ్ రెండో వివాహంపై వేణు స్వామి స్పందించారు. ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారీ స్వామీజీ.
‘నాకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చాలా మంది ఫోన్ చేసి సమంత రెండో పెళ్లి గురించి అడుగు తున్నారు. వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుందని పదే పదే ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో నాగ చైతన్య- శోభిత ధూళి పాళ్ల వివాహం గురించి నేను మాట్లాడినప్పుడు విమర్శించిన వారు, ట్రోల్ చేసిన వారు, మనోభావాలు దెబ్బతిన్న వారు.. ఇవాళ ఉదయం నుంచే జ్యోతిష్యల దగ్గరకు వెళ్లారు. సమంత జాతకం ఎలా ఉండనుంది? రెండో పెళ్లి చేసుకున్న సామ్- రాజ్ నిడిమోరు భవిష్యత్ లో ఎలా ఉండనున్నారు? కలిసుంటారా? విడిపోతారా? అని అడుగుతున్నారు. మరి వారి పెళ్లిపై మీకేమనిపిస్తోంది? అని అడుగుతున్నారు’
‘నేను గత మూడు రోజులుగా ఓ సినిమా సూపర్ సక్సెస్ కావాలని పూజలు, యాగాలు చేస్తున్నాను. ఇప్పుడు ఆ పనుల్లోనే బిజీగా ఉంటున్నాను. కాబట్టి వారి (సామ్- రాజ్ నిడిమోరు) గురించి నాకు అనవసరం. ఇప్పుడు నేను ఎవరి గురించి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటాను. తిరుమల శ్రీవారి దీవెనలతో నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తున్నాను’ ‘ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
సమంత పెళ్లిపై వేణు స్వామి రియాక్షన్.. వీడియో ఇదిగో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








