F3 Movie : నాన్ స్టాప్‌గా ‘ఎఫ్3’ షూటింగ్.. కామెడీ డోస్ మరింత పెంచనున్న వెంకీ- వరుణ్..

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా రాబోతోన్న ఎఫ్ 3 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

F3 Movie : నాన్ స్టాప్‌గా 'ఎఫ్3' షూటింగ్.. కామెడీ డోస్ మరింత పెంచనున్న వెంకీ- వరుణ్..
F3
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 17, 2021 | 10:25 AM

F3 Movie : సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఇక దానికి సీక్వెల్‌గా రాబోతోన్న ఎఫ్ 3 చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. థియేటర్లో నవ్వుల ఝల్లు కురిపించేలా ఈ సారి కామెడీ డోస్ పెంచుతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. టాలీవుడ్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎఫ్ 3 చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా భాటియా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో కనిపించబోతోన్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో సుధీర్ఘ షెడ్యూల్‌ను చిత్రయూనిట్ నిర్వహిస్తోంది. ఇందులో దాదాపు నటీనటులందరూ పాల్గొంటున్నారు. ఇటీవలే  దసరా సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పోస్టర్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు తమ తమ స్టైల్లో అదరగొట్టేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆసల్యం అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ను అనిల్ నాన్ స్టాప్‌గా సింగిల్ షెడ్యూల్ లోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. చివరిగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సాలిడ్ హిట్ అనుకున్న అనిల్ ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Manchu Vishnu: కొత్త టీమ్ వచ్చేసింది.. కానీ వారి పరిస్థితి ఏంటి.. ‘మా’ లో వీడని సస్పెన్స్

Natyam Pre Release Event LIVE: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. డ్యాన్స్‌పై ఇష్టంతోనే గెస్ట్‌గా హాజరవుతున్న చెర్రీ..

Eesha Rebba : తెలుగమ్మాయి పరువాల అందం.. చూడతరమా.. ‘ఈషా రెబ్బ’ న్యూ ఫొటోస్…