విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఎఫ్3. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. కానీ ఆ సినిమా కథకు ఈ సినిమా కథకు ఏమాత్రం సంబంధం ఉండదని దర్శకుడు అనిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది. ‘ఎఫ్ 2’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా మొదటి వేవ్ తర్వాత కొంత భాగం షూటింగ్ జరిపిన తరువాత సెకండ్ వేవ్ కారణంగా ఆపేశారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మళ్లీ సెట్స్ పైకి వెళ్లారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ద్వారా సినిమాలో త్రిబుల్ ఫన్ ఉండనుందని అర్ధమవుతుంది. అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సునీల్ నటించనున్నాడు. తాజాగా షూటింగ్ మొదలైందని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. షూట్ మొదలైంది అంటూ సందడి చేస్తున్న మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రయూనిట్. తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్ లో మొదలుపెట్టారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా విడుదల చేయనున్నట్టుగా ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో మిగిలిన షూటింగ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట అనిల్. ఈ సినిమా తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.
Triple Fun & Frustration is loading..
Shoot resumes, Finally back to sets with my #𝐅𝟑𝐌𝐨𝐯𝐢𝐞 fam!❤️🎉▶️https://t.co/vHJH7Ugknd@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official#F3DoseLoading pic.twitter.com/Ias3avHBvq
— Anil Ravipudi (@AnilRavipudi) September 17, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :