
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న కొందరు స్టార్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులే అన్న సంగతి తెలిసిందే. అనేక చిత్రాల్లో బాలనటీనటులుగా కనిపించిన చిన్నారులు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. కావ్య కళ్యాణ్ రామ్, తేజా సజ్జా, శ్రీవిద్య వంటి స్టార్స్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులే. తాజాగా ఇప్పుడు మరో కుర్రాడు హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో గుర్తున్నాడా.. ? వెంకటేశ్ నటించిన సూర్యవంశం సినిమాలో తనదైన నటనతో కట్టిపడేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవితోపాటు.. సౌందర్య, జగపతి బాబు, మహేశ్వరి కలిసి నటించిన ప్రియరాగాలు సినిమాలో సౌందర్య కొడుకుగా కనిపించారు. ఆ కుర్రాడి పేరు ఆనంద్ హర్షవర్దన్.
ఆనంద్ హర్షవర్దన్… ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పీబీ శ్రీనివాస్ మనవడు. బాల రామాయణం సినిమాలో వాల్మికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. ఇప్పుడు హీరోగా అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇటీవల నిదిరించు జహాపన సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఆనంద్.. అగ్ర హీరోలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఆనంద్ వర్దన్ మాట్లాడుతూ.. “వంశీ బర్కీలీ అనే అవార్డ్ సమయంలో నాకు మనసంతా నువ్వే సినిమాకు అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ చూడటానికి ఆస్కార్ అవార్డులా ఉంటుంది. ఆ అవార్డ్ ఇచ్చాక మాట్లాడమంటే నేను.. ఈ అవార్డ్ చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకోవడం నాకు ఆస్కార్ అవార్డుల ఉంది అని అనడంతో చిరంజీవి గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఆనంద్ వర్దన్.. చిరంజీవితో కలిసి శ్రీ మంజునాథ సినిమాలో నటించాడు. ప్రియరాగాలు, ప్రేమించుకుందాం రా, పెళ్లి పందిరి, సూర్యవంశం, మనసంతా నువ్వే, మావిడాకులు వంటి చిత్రాల్లో నటించాడు.
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన