AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ‘దృశ్యం’తో మ‌రోసారి వెంకీ మెస్మ‌రైజ్ చేస్తారా..?

టాలీవుడ్ అగ్ర‌హీరో వెంకటేశ్​కు  ప్ర‌స్తుతం మంచి క‌థల‌పై ఫోక‌స్ పెట్టారు. చేతిలో సినిమాలు ఉన్నప్ప‌టికీ ఆయ‌న స్టోరీల కోసం వెతుకులాట ఆప‌డం లేదు. తాజాగా ఈ సెర్చింగ్ కి ఓ కామా పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 

మరో 'దృశ్యం'తో మ‌రోసారి వెంకీ మెస్మ‌రైజ్ చేస్తారా..?
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 5:16 PM

Share

టాలీవుడ్ అగ్ర‌హీరో వెంకటేశ్​కు  ప్ర‌స్తుతం మంచి క‌థల‌పై ఫోక‌స్ పెట్టారు. చేతిలో సినిమాలు ఉన్నప్ప‌టికీ ఆయ‌న స్టోరీల కోసం వెతుకులాట ఆప‌డం లేదు. తాజాగా ఈ సెర్చింగ్ కి ఓ కామా పెట్టిన‌ట్లు తెలుస్తోంది.  ఇప్పటికే వెంకీ వ‌ద్ద‌ మూడు సినిమాలు ఉన్నాయి. ప్ర‌జంట్ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అదికాక‌..తరుణ్‌ భాస్కర్‌, అనిల్‌ రావిపూడిల చిత్రాలు వ‌రుస‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన స్టోరీలు ఇప్పటికే ఫైన‌ల్ అయిన‌ట్లు సమాచారం. ఇప్పుడు ఈ లిస్ట్ లో ‘దృశ్యం 2’ చేరే అవకాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

కంప్లీట్ యాక్ట‌ర్ మోహన్‌లాల్‌ – మీనా జంటగా నటించిన ‘దృశ్యం’ మలయాళంలో సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. జీతూ జోసెఫ్ డైరెక్ష‌న్లో వ‌చ్చిన‌ ఆ సినిమాను.. తెలుగులో అదే పేరుతో వెంకటేష్‌, మీనాలతో రీమేక్ చేయ‌గా ఇక్కడా సూప‌ర్ హిట్ట‌య్యింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సీక్వెల్‌ చేస్తే బాగుంటుందనే ఆలోచన అప్పట్లో రెండు ఇండస్ట్రీల‌లోనూ వినిపించింది. తాజాగా మలయాళంలో ‘దృశ్యం 2’ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లారు డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్‌. ఇందులోనూ మోహన్‌లాల్​ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఫ‌స్ట్ పార్ట్ ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుంచే ఈ సీక్వెల్‌ కథ ప్రారంభించ‌నున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ సీక్వెల్ విజ‌యం సాధిస్తే తెలుగులోనూ ‘దృశ్యం 2’ రీమేక్‌కి ముహూర్తం కుదిరే అవ‌కాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే వెంకటేష్‌కు మరో హిట్​ కొట్టిన‌ట్లే అంటున్నారు ఇండ‌స్ట్రీ జ‌నాలు. ఇది ముందుకు వెళుతుందా? లేదా? అన్నది మలయాళ ‘దృశ్యం-2’ రిజ‌ల్ట్ పైనే ఆధారపడి ఉంటుంది.

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!