జాతి వివక్ష ఉందంటున్న బుల్లితెర నటి

Chandni Bhagwanani Shares Racist Attack in Melbourne : జాతి వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో చాలా మంది తమకు జరిగిన అవమానాలను సోషల్ మీడియాలో ఎకరువు పెడుతున్నారు. తాము కూడా బాధితులమే నంటూ జరిగిన వివక్షపై గొంతెత్తున్నారు. అయితే తాజాగా తాను కూడా బాధితురాలినేనంటూ చెప్పింది బుల్లితెర న‌టి చాందిని భ‌గ్వనాని. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఆమె.. త‌నకు ఎదురైన చేదు ఘ‌ట‌న గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. […]

జాతి వివక్ష ఉందంటున్న బుల్లితెర నటి
Follow us

|

Updated on: Jul 10, 2020 | 6:13 PM

Chandni Bhagwanani Shares Racist Attack in Melbourne : జాతి వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో చాలా మంది తమకు జరిగిన అవమానాలను సోషల్ మీడియాలో ఎకరువు పెడుతున్నారు. తాము కూడా బాధితులమే నంటూ జరిగిన వివక్షపై గొంతెత్తున్నారు. అయితే తాజాగా తాను కూడా బాధితురాలినేనంటూ చెప్పింది బుల్లితెర న‌టి చాందిని భ‌గ్వనాని.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉంటున్న ఆమె.. త‌నకు ఎదురైన చేదు ఘ‌ట‌న గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తాను మెల్‌బోర్న్ నుంచి ఓ ప్ర‌దేశానికి వెళ్లేందుకు బ‌స్సు ఎక్కిన సమయంలో జరిగిన దారుణాన్ని చెప్పుకొచ్చారు. అయితే అక్క‌డ బస్సు ప్ర‌యాణం చేయడం అదే తొలిసారట. బ‌స్సు ఎన్నో మ‌లుపులు తిరుగుతుండ‌టంతో గాబ‌రా ప‌డ్డ ఆమె డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఇది స‌రైన స్థానానికే వెళ్తుందా? అని అడిగిందట. కానీ అత‌ని వైపు నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదట. ఇంత‌కుముందు తాను అడిగింది విన‌లేదేమోన‌ని ఆమె మ‌రోసారి ప్ర‌య‌త్నం చేయ‌గా డ్రైవర్ పట్టించుకున్నట్లుగా కనిపించలేదట… అయితే ఇలాంట ప్రశ్నలనే స్థానిక ప్రయాణికులు అడగటంతో నెమ్మదిగా చెప్పాడని… అయితే తాను కూడా మరోసారి ప్రయత్నిస్తే.. బూతులు తిట్టాడని తెలిపింది. దీంతో వ‌ణుకుతూనే బ‌స్సు దిగిపోయానని చెప్పుకొచ్చింది.

జాతి వ‌వ‌క్ష ఆస్ట్రేలియాలో  ఇంకా ఉంది అన‌డానికి నాకు జ‌రిగిన ఈ అనుభ‌వ‌మే నిద‌ర్శ‌నం అని తెలిపింది. కాగా చాందిని కొన్ని ప్రోగ్రాములు చేయ‌డం కోసం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే లాక్‌డౌన్ వ‌ల్ల అక్క‌డే చిక్కుకుపోయింది. ఆమె చివ‌రిసారిగా “సంజీవ‌ని” వెబ్‌సిరీస్‌లో క‌నిపించింది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో