‘షాడో’ వెబ్​సిరీస్​లో రానా, అల్లరోడు…!

ప్ర‌స్తుతం క‌రోనా వ‌చ్చి అన్ని రంగాల‌ను కుదిపేసింది. ఈ క్ర‌మంలో సినిమా ప‌రిశ్ర‌మ కూడా బాగా దెబ్బ‌తింది. ఇప్ప‌టికీ థియేట‌ర్స్ ఎప్పుడు తెరుస్తారో అర్థం అవ్వ‌డం లేదు. దీంతో నిర్మాత‌లు ఓటీటీల‌వైపు అడుగులు వేస్తున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 5:59 pm, Fri, 10 July 20
'షాడో' వెబ్​సిరీస్​లో రానా, అల్లరోడు...!

ప్ర‌స్తుతం క‌రోనా వ‌చ్చి అన్ని రంగాల‌ను కుదిపేసింది. ఈ క్ర‌మంలో సినిమా ప‌రిశ్ర‌మ కూడా బాగా దెబ్బ‌తింది. ఇప్ప‌టికీ థియేట‌ర్స్ ఎప్పుడు తెరుస్తారో అర్థం అవ్వ‌డం లేదు. దీంతో నిర్మాత‌లు ఓటీటీల‌వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ‌ప్ర‌ముఖ నిర్మాణసంస్థ ఏకే ఎంటర్​టైన్మెంట్స్​ ఓ వెబ్​సిరీస్​ను రూపొందించబోతోంది. రచయిత మధు బాబు రాసిన షాడో న‌వ‌ల‌ ఆధారంగా ‘షాడో’ అనే వెబ్​సిరీస్​ను నిర్మించనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఈ వెబ్​సిరీస్​లో రెండు కీలక పాత్రల కోసం రానా దగ్గుపాటి, అల్లరి నరే​శ్ లను నిర్మాణ సంస్థ సంప్రదించిందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి వారిద్దరూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రి-ప్రొడక్షన్​ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ.