Saindhav Movie Review: అదరగొట్టిన వెంకీ.. సైంధవ్ సినిమా ఎలా ఉందంటే

వెంకటేష్ 75వ సినిమాగా వచ్చింది సైంధవ్. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. వెంకీ తన మైల్ స్టోన్ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Saindhav Movie Review: అదరగొట్టిన వెంకీ.. సైంధవ్ సినిమా ఎలా ఉందంటే
Saindhavtrailer
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 13, 2024 | 12:47 PM

రివ్యూ: సైంధవ్

నటీనటులు: వెంకటేష్, శ్రద్ధా శ్రీనాథ్, నవజుద్దీన్ సిద్ధికీ, ముఖేష్ రుషి, ఆర్య, ఆండ్రియా తదితరులు

సినిమాటోగ్రఫర్: ఎస్ మణికందన్

ఎడిటర్: గ్యారీ బిహెచ్

సంగీతం: సంతోష్ నారాయణన్

నిర్మాత: వెంకట్ బోయినపల్లి

దర్శకుడు: శైలేష్ కొలను

వెంకటేష్ 75వ సినిమాగా వచ్చింది సైంధవ్. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. వెంకీ తన మైల్ స్టోన్ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

సైంధవ్ కోనేరు (వెంకటేష్) చంద్రప్రస్థలోని పోర్ట్‌లో జాబ్ చేస్తుంటాడు. ఆయనకు కూతురు గాయత్రి (సారా పాలేకర్) ఉంటుంది. బిడ్డ అంటే సైంధవ్‌కు ప్రాణం. అదే కాలనీలో పక్కింట్లో ఉండే మనోజ్ఞ (శ్రద్దా శ్రీనాథ్)తో సైంధవ్ ప్రేమగా ఉంటాడు. ఆమె ఓ క్యాబ్ డ్రైవర్. భర్త (గెటప్ శ్రీను)తో గొడవ కారణంగా దూరంగా ఉంటుంది. సైంధవ్ అంటే మనోకు ప్రాణం.. అదే సమయంలో గాయత్రిని కూడా ప్రేమగా చూసుకుంటుంది మనో. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఉన్నట్లుండి స్కూల్‌లో గాయత్రి ఉన్నట్టుండి కింద పడిపోతుంది. హాస్పిటల్‌కు తీసుకెళ్తే పాపకు SMA వ్యాధి గురించి తెలుస్తుంది. పాప బతకాలంటే రూ. 17 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ చేయాలని డాక్టర్లు చెబుతారు. దాంతో సైంధవ్ ఆలోచనలో పడతాడు. అదే సమయంలో చంద్రప్రస్థ పోర్టుకు 6000 కోట్ల ఖరీదైన గన్స్, డ్రగ్స్, ఫేక్ కరెన్సీ వస్తాయి. దాన్ని కస్టమ్స్ అధికారి మూర్తి (జయప్రకాశ్) సీజ్ చేస్తాడు. అప్పుడు ఆ సీన్‌లోకి సైంధవ్ వస్తాడు. ఆ కంటైనర్‌ను బయటికి తీసుకురావాలని కోసం మిత్రా (ముఖేష్ రుషి), వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మైఖేల్ (జిష్షు సేన్ గుప్తా) లాంటి కార్టల్ బృందం కష్టపడుతుంది. ఆ తర్వాత ఏమైంది.. గాయత్రిని నయం అవుతుందా.. సైంధవ్ ఎందుకు మళ్లీ సైకోగా మారతాడు అనేది అసలు కథ..

కథనం:

ఆలోచన మాత్రమే అద్భుతంగా ఉంటే సరిపోదు.. ఆచరణ కూడా అదే స్థాయిలో ఉండాలి. అది లేకే చాలా సినిమాలు మిస్ ఫైర్ అవుతుంటాయి. సైంధవ్ సినిమా విషయంలోను ఇదే జరిగింది. దర్శకుడు శైలేష్ తీసుకున్న పాయింట్ బాగుంది. ఒక ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కానీ దాన్ని డీల్ చేసిన విధానం గొప్పగా అనిపించలేదు. సినిమా మొదట్లోనే ఇంట్రెస్టింగ్ నోట్ ఉంటుంది.. మెల్లగా వేగం పుంజుకుంటుంది కానీ.. ఒకచోటకి వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ముందుకెళ్లకుండా అక్కడే కథ మొరాయిస్తుంది. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ డ్రామాలా ఉంది.. కాకపోతే ఇది మెడికల్ మాఫియా.. వెంకటేష్ ను చూసి ఎందుకు అంతగా అందరు భయపడుతున్నారు..? గతంలో ఆయన చేసిన మారణ హోమం ఏంటి అనేది డైరెక్టర్ చూపించలేకపోయాడు. ఫస్టాఫ్ వరకు ఏదో యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ తో లాక్కొచ్చాడు. కీలకమైన సెకండ్ ఆఫ్ మాత్రమే ఆసక్తికరంగా అనిపించలేదు. హిట్ సిరీస్ లో శైలేష్ స్క్రీన్ ప్లే అదిరిపోతుంది. కానీ రొటీన్ స్క్రీన్ ప్లే సైంధవ్ కు మైనస్ అయింది. పాప సెంటిమెంట్ బాగానే ఉన్నా.. ఎక్కడో ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వవు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకోదు. ఆ విషయంలో దర్శకుడు కాస్త ఆలోచించి ఉండాల్సిందేమో..? డ్రామా కంటే యాక్షన్ ఎక్కువైపోయింది.. కొన్ని ఫైట్ సీన్స్ అదిరిపోయాయి.. వాటిలో వెంకీ ఎనర్జీ సూపర్. సైంధవ్ ఫ్లాష్ బ్యాక్, ఆర్య ఎపిసోడ్స్‌పై కాస్త క్లారిటీగా చెప్పుంటే కథ డెప్త్ తెలిసేది. కేవలం బిల్డప్ మాత్రమే ఉండటంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు.

నటీనటులు:

వెంకటేష్ తన వరకు పూర్తి న్యాయం చేశాడు.. కానీ కథలో కొత్తదనం లేక సైంధవ్ వెనకబడ్డాడు. చిన్న పాప సారా పాలేకర్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఆర్య క్యారెక్టర్ కు ఇంకాస్త డెప్త్ ఇచ్చుంటే బాగుండేది. శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా క్యారెక్టర్స్ బాగున్నాయి. ఈ సినిమాకు మేజర్ రిలీఫ్ నవాజుద్దీన్ సిద్ధికి. విలనిజంతో పాటు కామెడీ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నాడు.. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఒకట్రెండు పర్లేదు అనిపిస్తాయి. ఎడిటింగ్ చాలా వరకు స్లో సన్నివేశాలున్నాయి. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి గ్యారీ బిహెచ్‌ను తప్పుబట్టలేం. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు శైలేష్ కొలను ఐడియా బాగుంది కానీ.. ఎగ్జిగ్యూషన్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సైంధవ్.. ఇంట్రెస్టింగ్ ఐడియా.. బోరింగ్ నెరేషన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా