AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్ వద్ద ఫ్యాన్స్‌ హంగామా.. బాలయ్య, గోపి చంద్ చిత్ర యూనిట్ సందడి

తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో..  తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది.

Veera Simha Reddy: భ్రమరాంబ థియేటర్ వద్ద ఫ్యాన్స్‌ హంగామా.. బాలయ్య, గోపి చంద్ చిత్ర యూనిట్ సందడి
balakrishna at bramaramba theatre
Surya Kala
|

Updated on: Jan 12, 2023 | 8:47 AM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపి చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ మూవీ. తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకి అనుమతి ఇవ్వడంతో.. తెల్లవారుజామున 4 గంటల నుంచే షోలు మొదలయ్యాయి. దీంతో థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా వీర సింహా రెడ్డి రిలీజైన థియేటర్ల వద్ద బాలకృష్ణ ఫ్యాన్స్ సందడి నెలకొంది.

మరోవైపు భాగ్యనగరంలోనూ పలు థియేటర్స్ వద్ద అభిమానులతో పాటు పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. ముఖ్యంగా కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం ఓ రేంజ్ లో సాగింది. సంక్రాంత్రి సంబరాలను దీపావళి అన్న రేంజ్ లో చేశారు. క్రాకర్స్ కాలుస్తూ..  డప్పులు, డ్యాన్స్ లతో హంగామా సృష్టించారు. థియేటర్ వద్ద బాలయ్య బాబు,గోపి చంద్ మలినేని సహా చిత్ర యూనిట్ ఫ్యాన్స్ తో కలిసి సందడి చేశారు. థియేటర్ లో అభిమానుల మధ్య కూర్చుని హీరో బాలకృష్ణ, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమా చూశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు వీరసింహా రెడ్డి మూవీ అడ్వాన్స్ బుకింగ్ లోనూ  అదరగొట్టింది. వాస్తవంగా చెప్పాలంటే… బాలయ్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ ఇదే మొదటిసారి. అడ్వాన్స్ బుకింగ్ తో  హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్‌లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్షల రూపాయలు సొంతం చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..