Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan’s Vakeel Saab Trailer: వకీల్ సాబ్ క్రేజీ అప్డేట్ .. ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర యూనిట్

Power star Pawan Kalyan: హిట్ ప్లాప్ లతో సంబంధం లేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు మూడేళ్ళ విరామం తీసుకున్నారు.. తాజాగా వకీల్ సాబ్ సినిమాతో...

Pawan Kalyan's Vakeel Saab Trailer: వకీల్ సాబ్ క్రేజీ అప్డేట్ .. ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన చిత్ర యూనిట్
Vakil Saab
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Mar 25, 2021 | 4:39 PM

Vakeel Saab movie : హిట్ ప్లాప్ లతో సంబంధం లేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు మూడేళ్ళ విరామం తీసుకున్నారు.. తాజాగా వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా రానున్న వకీల్ సాబ్ మూవీతో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’ మూవీతో బిగ్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. వేసవి వినోదంగా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ప్రకటించింది. దిల్ రాజు సోషల్ మీడియా వేదికగా మార్చి 29న ట్రైలర్ రిలీజ్ చేయనున్నామని తెలిపారు

మూవీ ప్రమోషన్ లో భాగంగా చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. “వకీల్ సాబ్” టైటిల్ కంటే ముందు “మగువ” అని అనుకున్నామని చెప్పారు. అయితే తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్లుగా వకీల్ సాబ్ పేరును చేంజ్ చేశామని అన్నారు. వకీల్ సాబ్ ఏప్రిల్ 9 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మరోవైపు వకీల్ సాబ్ డిజిటల్ రైట్స్ తో పాటు.. శాటిలైట్ రైట్స్ కూడా అత్యధిక ధరకు పలికినట్లు సమాచారం. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా నివేతా థామస్, అంజలి, అనన్య నాగల్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  అయితే మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్ అక్యుపెన్సీపై అనుమానం ఏర్పడింది. అయితే తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు యథాతథంగా నడుస్తాయని క్లారిటీ ఇవ్వడంతో పవన్‌ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Also Read: కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఆకాష్ పూరి సినిమా.. కీలక పాత్రలో శివగామి

 హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు అందుకే సినిమా జాతీయ అవార్దును సొంతం చేసుకుంది..