AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryadevara Naga Vamsi: హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు అందుకే సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది..

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో యువ నిర్మాత సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన 'జెర్సీ' మూవీ 2019

Suryadevara Naga Vamsi: హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు అందుకే సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది..
Suryadevara Naga Vamsi
Rajeev Rayala
| Edited By: |

Updated on: Mar 24, 2021 | 4:25 PM

Share

Suryadevara Naga Vamsi: సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కత్వంలో యువ నిర్మాత సూర్య‌‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ‘జెర్సీ’ మూవీ 2019 జాతీయ చల‌న‌చిత్ర అవార్డుల్లో ఉత్త‌మ తెలుగు చిత్రంగా పుర‌స్కారాన్ని గెలుచుకొని స‌గ‌ర్వంగా నిలిచింది. అలాగే ఈ చిత్రానికి ప‌నిచేసిన న‌వీన్ నూలి ఉత్త‌మ ఎడిట‌ర్‌గా అవార్డును పొందారు. ఈ రెండు పుర‌స్కారాలు తెచ్చిన ఆనందాన్ని ఆస్వాదిస్తూనే.. ‌మార్చి 26న విడుద‌ల‌వుతున్న ‘రంగ్ దే’ చిత్రం ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నారు నాగ‌వంశీ. ఈ సంద‌ర్భంగా  మీడియాతో స‌మావేశ‌మై  ‘జెర్సీ’ సినిమా విశేషాల‌ను పంచుకున్నారు.

‘జెర్సీ’కి అవార్డులు వ‌స్తాయ‌ని ఊహించాం. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త ఏడాది జాతీయ అవార్డులు లేక‌పోయేస‌రికి వాటి గురించి మ‌ర్చిపోయాం. కానీ ఇప్పుడు హ‌ఠాత్తుగా ప్ర‌క‌టించేస‌రికి ఆశ్చ‌ర్య‌మూ, ఆనంద‌మూ రెండూ క‌లిగాయి. తొలిసారి మా సినిమాకు జాతీయ అవార్డులు రావ‌డం సంతోషంగా అనిపిస్తోంది. ఆ సినిమా కోసం హీరో నాని చాలా ఎఫ‌ర్ట్ పెట్టారు, బాగా క‌ష్ట‌ప‌డ్డారు. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ప‌డిన క‌ష్టం కూడా చిన్న‌దేమీ కాదు” అన్నారు.అలాగే ” గౌత‌మ్ ఈ క‌థ చెప్పిన‌ప్పుడు బాగా న‌చ్చేసింది. బేసిక‌ల్‌గా నాకు క్రికెట్ అంటే ఇష్టం. ఆ నేప‌థ్యం ఉన్న క‌థ కావ‌డం, మంచి భావోద్వేగాలు ఉండ‌టంతో క‌నెక్ట‌య్యాను. నానితో ఈ సినిమా చేయాల‌నుకున్నాడు గౌత‌మ్‌. అయితే ఏడు సంవ‌త్స‌రాల కొడుకు ఉన్న తండ్రి క‌థ‌ని నాని ఒప్పుకుంటారా, లేదా అని సందేహించాం. కానీ విన‌గానే నాని ఈ క‌థ‌ను న‌మ్మారు. ఏమాత్రం సందేహించ‌కుండా ఏడేళ్ల కొడుకున్న తండ్రిగా సూప‌ర్బ్‌గా న‌టించారు” అంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

దర్శకేంద్రని ఇంట విషాదం.. ఆర్కే ఫిలిమ్స్ అధినేత కన్నుమూత.. సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు..

Senior Hero Tarun : మళ్ళీ వెండి తెరపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్న అలనాటి లవర్ బాయ్

Follow Us
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర..
ఢిల్లీలో హైఅలర్ట్.. భారీ పేలుళ్లకు లష్కరే తోయిబా కుట్ర..
తొలి ప్రేమ హీరోయిన్ మా వదిన.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
తొలి ప్రేమ హీరోయిన్ మా వదిన.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..
భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలా..? బెడ్ రూంలో ఈ చిన్న మార్పులు..
భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలా..? బెడ్ రూంలో ఈ చిన్న మార్పులు..
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య