Krithi Shetty: సినిమా మొదలైన కొద్దిరోజులకే ఆ విషయం అర్ధమైంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కృతి..

టాలీవుడ్ లో అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అష్టాచమ్మ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా ఇంద్రగంటి..

Krithi Shetty: సినిమా మొదలైన కొద్దిరోజులకే ఆ విషయం అర్ధమైంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కృతి..
Krithi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 02, 2022 | 1:10 PM

Krithi Shetty: టాలీవుడ్ లో అందమైన ప్రేమ కథలను తెరకెక్కించడం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అష్టాచమ్మ సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా ఇంద్రగంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు సుధీర్ బాబుతో కలిసి సినిమాకి చేస్తున్నారు మోహన్ కృష్ణ. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. వీటి సమ్మోహనం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆకట్టుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత వచ్చిన వి సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. వి సినిమాలో నాని , సుధీర్ బాబు కలిసి నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికి సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా చేయనున్నాడు. హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో రాబోతోన్న మూడవ‌ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా అందాల భామ కృతి శెట్టి మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా మొదలైన కొద్ది రోజులకే ఇది నాకు గొప్ప అనుభవం ఇచ్చే సినిమా అవుతుందని అర్థమైంది అని అంది. కథలోనే మా పాత్రలన్నీ అంత వివరంగా ఉన్నాయి. కొందరికి రొమాంటిక్ పార్ట్, మరికొందరికి ఫ్యామిలీ పార్ట్ నచ్చుతాయి. సినిమా అంతా మన ఇరుగు పొరుగు ఇంట్లో జరిగినంత సహజంగా ఉంటుంది. సుధీర్ బాబు అంత కోపరేట్ చేసే హీరోను చూడలేదు. మన క్యారెక్టర్ మనం చేసేందుకే కష్టపడాలి. అలాంటిది మాకు సపోర్ట్ చేస్తుంటారు. మైత్రీ మూవీస్ మై త్రీ అని చెప్పుకుంటాను. బెంచ్ మార్క్ స్టూడియోస్ కూడా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి అని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

RRR Movie: ‘కొత్తగా ఏమైంది.. అనుకున్నదే అయిందిగా’.. ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాపై వైరల్‌ అవుతోన్న మీమ్స్‌ చూశారా.?

Ashok Galla’s Hero : సంక్రాంతి పండక్కి వస్తానంటున్న మహేష్ మేనల్లుడు.. అశోక్ గల్లా “హీరో” రిలీజ్ అప్పుడే..

Sudheer Babu: గ్లిజరిన్ లేకుండా ఏడ్చేయగల హీరోయిన్ ఆమె.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన సుధీర్ బాబు..

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్