Kollywood: కోలీవుడ్‌లో స్టార్స్ మధ్య బిగ్ ఫైట్.. ఆ పండగను టార్గెట్ చేసిన బడా హీరోలు
తల సినిమా అంటే సంక్రాంతికి థియేటర్లలో దీపావళి జరగాల్సిందేనని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. టాపాసుల మోత అదే రేంజ్‌లో మోగించారు. ఇటు విజయ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వారసుడుతో పండగ సందడంటే ఇది కదా అనిపించారు.

గతంలో ఎప్పుడూ కనిపించనంత ఉత్కంఠ మొన్న పొంగల్‌కి తమిళనాడులో కనిపించింది. తెగింపు సినిమాతో ప్రేక్షకులకోసం సిద్ధమైపోయారు అజిత్. తల సినిమా అంటే సంక్రాంతికి థియేటర్లలో దీపావళి జరగాల్సిందేనని ఫిక్సయ్యారు ఫ్యాన్స్. టాపాసుల మోత అదే రేంజ్‌లో మోగించారు. ఇటు విజయ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వారసుడుతో పండగ సందడంటే ఇది కదా అనిపించారు. మళ్లీ ఈ స్టార్లిద్దరూ బాక్సాఫీస్ దగ్గర అక్టోబర్‌లో తలపడతారన్నది కోలీవుడ్‌లో ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచీ నలుగుతున్న విషయం. అదే మాటకు కట్టుబడి ఆల్రెడీ నెక్స్ట్ మూవీ షూట్ స్టార్ట్ చేసేశారు విజయ్. లోకేష్ కనగరాజ్ డైరక్షన్‌లో లియో ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లో అద్భుతంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకంట్ షెడ్యూల్ చేస్తున్నారు మేకర్స్.
లియోతో పోటీపడదామనుకున్న అజిత్ ఇంకా నెక్స్ట్ సినిమా షెడ్యూల్స్ మొదలుపెట్టనేలేదు. ముందు అనుకున్న ప్రకారం విఘ్నేష్ శివన్‌తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఉంటే, ఈ పాటికి కొంత చిత్రీకరణ కూడా జరిగి ఉండేది. కానీ ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అయింది. మగిళ్ తిరుమేని డైరక్షన్‌కి ఓకే చెప్పారు తల. అది కూడా ఫైనల్ స్క్రిప్టింగ్ స్టేజ్‌లో ఉంది. అందుకే… తొందరేమీ లేదు.. మనం సంక్రాంతికి వద్దాం. ఈ ఇయర్ తునివు మాత్రమే కాదు, లాస్ట్ ఇయర్ వలిమై కూడా పొంగల్‌కే రిలీజ్ చేశాం. అదే ఫార్ములా ఫాలో అవుదామని అన్నారట అజిత్.
నెక్స్ట్ ఇయర్ కోలీవుడ్ నుంచి పొంగల్ రేస్‌లో ఆల్రెడీ కన్‌ఫర్మ్ అయిన పేరు సూర్య. దరువు శివ దర్శకత్వంలో ప్రెస్టీజియస్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సూర్య. ఈ ప్రాజెక్టును సంక్రాంతి బరిలోకి తీసుకురావాలన్నది ప్లాన్. సో 2024 కోలీవుడ్ బరిలో సూర్య వర్సెస్ అజిత్ పోటీ షురూ కానుందన్నమాట.




