AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT Summit 2024: ‘యానిమల్’ సినిమా సక్సెస్ పై ఖుష్బూ కామెంట్స్.. వారి మనస్తత్వమే సమస్య అంటూ..

ఈ మెగా ఎన్‏క్లేవ్ లో పాల్గొన్న సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ.. తన తల్లి పట్ల తన తండ్రి వ్యవహరించిన తీరును మరోసారి గుర్తుచేసుకున్నారు. తన తల్లి పరిస్థితి చూసి ఎప్పుడూ నిస్సహాయురాలిగా మారకూడదని అనుకున్నానని.. తమ తల్లి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఎప్పటికీ ఒక నిస్సహాయ మహిళగా మారకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది.

Rajitha Chanti
|

Updated on: Feb 25, 2024 | 9:19 PM

Share

ఇండియా నంబర్ వన్ న్యూస్ నెట్‏వర్క్ Tv9 నిర్వహిస్తున్న ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ రెండో ఎడిషన్ ఆదివారం (ఫిబ్రవరి 25న) న్యూఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమయ్యింది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఈ మెగా ఎన్‏క్లేవ్ లో భాగమవుతున్నారు. మూడు రోజులు ఈ సమ్మిట్ జరగనుంది. మొదటిరోజు వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన ప్రముఖులను టీవీ9 నెట్ వర్క్ సత్కరించింది. ఈ కార్యక్రమంలోనే సినీ నటి రవీనా టాండన్‏ను నక్షత్ర సమ్మాన్ అవార్డుతో సత్కరించింది టీవీ9. ఈ మెగా ఎన్‏క్లేవ్ లో పాల్గొన్న సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ.. తన తల్లి పట్ల తన తండ్రి వ్యవహరించిన తీరును మరోసారి గుర్తుచేసుకున్నారు. తన తల్లి పరిస్థితి చూసి ఎప్పుడూ నిస్సహాయురాలిగా మారకూడదని అనుకున్నానని.. తమ తల్లి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఎప్పటికీ ఒక నిస్సహాయ మహిళగా మారకూడదని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చింది. ప్రతి విషయానికి ఎప్పుడూ తలాడించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.

అలాగే ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యానిమల్ సినిమా విజయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఖుష్బూ మాట్లాడుతూ.. “యానిమల్ సినిమా విజయం కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ప్రజల ఆలోచనల గురించి మనం ఏమి చెప్పగలం ?.. యానిమల్ లాంటి సినిమాలను మళ్లీ మళ్లీ చూడడానికి ఇష్టపడుతున్నారు. సినీ ప్రేక్షకుల మనస్తత్వమే ఇప్పుడు సమస్య. సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయి” అని అన్నారు ఖుష్బూ. తాను ముంబై నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యాయని.. కెరీర్ తొలినాళ్లలో తనను తమిళం నేర్చుకోమని తన సన్నిహితులు సూచించారని తెలిపింది. లైట్ మ్యాన్, కెమెరా పర్సన్, సెట్ లో పనిచేసే వ్యక్తులు తాను తమిళం నేర్చుకోవడంలో ఎంతో సహయం చేశారని చెప్పుకొచ్చింది.

WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.