Sanjana Sarathy: ఈ అందాల రాశి ఎవరో గుర్తుపట్టగలరా ?.. అప్పుడు ఆ స్టార్ హీరో చెల్లెలు.. కానీ ఇప్పుడు..
కేవలం కథానాయికలు కాకుండా సహయ పాత్రలలో నటించిన ముద్దుగుమ్మలకు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసి స్పెషల్ అట్రాక్షన్ అయిన తారల గురించి తెలిసిందే. అలాంటి వారిలో సంజన సారథి ఒకరు. కానీ ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చెల్లెలు అంటే మాత్రం గుర్తుపట్టేస్తారు. విజయ్ నటించిన తుపాకీ సినిమాలో అతడి చెల్లిగా కనిపించి.. తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
ఒక్క సినిమాతోనే అడియన్స్ హృదయాలను దొచేసిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. కేవలం కథానాయికలు కాకుండా సహయ పాత్రలలో నటించిన ముద్దుగుమ్మలకు కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. హీరో సిస్టర్ క్యారెక్టర్ చేసి స్పెషల్ అట్రాక్షన్ అయిన తారల గురించి తెలిసిందే. అలాంటి వారిలో సంజన సారథి ఒకరు. కానీ ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి చెల్లెలు అంటే మాత్రం గుర్తుపట్టేస్తారు. విజయ్ నటించిన తుపాకీ సినిమాలో అతడి చెల్లిగా కనిపించి.. తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘తుపాకీ’ సినిమా బాక్సాఫఈస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ రెండో చెల్లిగా నటించింది సంజనా సారథి. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
తుపాకి సినిమాలో తన పాత్రకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది సంజనా. ఆ తర్వాత తెలుగులో సరసాలు చాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ అంతగా మెప్పించకపోవడంతో సంజనాకు గుర్తింపు రాలేదు. దీంతో తిరిగి కోలీవుడ్ షిఫ్ట్ అయ్యింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అటు సినిమాల్లో నటిస్తూనే.. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన జిమ్ వర్కవుట్ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఒకప్పుడు విజయ్ చెల్లిగా కనిపించిన టీనేజ్ అమ్మాయి..ఇప్పుడు హీరోయిన్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2012లో బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన వజక్కు ఎన్ 18/9 చిత్రంతో సంజన సారథి తొలిసారిగా నటించింది. తర్వాత ఎండ్రెండ్రుమ్ పున్నగై, వాలు, ఎనై నోకి పాయుమ్ తోట, బ్రో చిత్రాల్లో నటించింది. ఫింగర్‌టిప్, టైమ్ ఎన్నా బాస్ వంటి వెబ్ సిరీస్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చటర్‌ఫాక్స్ అనే లేబుల్‌ను నడుపుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.