AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇట్స్ ఫిక్స్..చిరూతో 13 ఏళ్ల తర్వాత త్రిష రొమాన్స్..!

చిరంజీవి, కొరటాల సినిమాలో హీరోయిన్ ఎవరూ..?. టెక్నీషియన్స్ అందరూ ఫైనల్ అయ్యాక కూడా ఈ క్వశ్చన్‌కి మాత్రం ఆన్సర్ దొరకలేదు. నయన్, కాజల్, త్రిష లాంటి చాలా మంది సీనియర్ హీరోయిన్స్ పేర్లు వినిపించినా.. మూవీ టీం అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్‌తో, స్క్రీన్ షేర్ చేసుకోబోయే బ్యూటీ ఎవరో పక్కా క్లారిటీ వచ్చేసింది. బయటకు చెప్పకపోయినా త్రిషే ఈ మూవీలో హీరోయిన్ అని కన్ఫార్మ్ అయిపోయింది. అది ఎలా అంటారా..?. ఇటీవల […]

ఇట్స్ ఫిక్స్..చిరూతో 13 ఏళ్ల తర్వాత త్రిష రొమాన్స్..!
Ram Naramaneni
|

Updated on: Dec 16, 2019 | 7:05 PM

Share

చిరంజీవి, కొరటాల సినిమాలో హీరోయిన్ ఎవరూ..?. టెక్నీషియన్స్ అందరూ ఫైనల్ అయ్యాక కూడా ఈ క్వశ్చన్‌కి మాత్రం ఆన్సర్ దొరకలేదు. నయన్, కాజల్, త్రిష లాంటి చాలా మంది సీనియర్ హీరోయిన్స్ పేర్లు వినిపించినా.. మూవీ టీం అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ మాత్రం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మెగాస్టార్‌తో, స్క్రీన్ షేర్ చేసుకోబోయే బ్యూటీ ఎవరో పక్కా క్లారిటీ వచ్చేసింది.

బయటకు చెప్పకపోయినా త్రిషే ఈ మూవీలో హీరోయిన్ అని కన్ఫార్మ్ అయిపోయింది. అది ఎలా అంటారా..?. ఇటీవల ఓ మూవీ అనలిస్ట్ అండ్ రివ్యూవర్.. త్రిష తర్వాత మూవీస్‌కు సంబంధించి ఓ ట్వీట్ వేశాడు. ” నెక్ట్స్ ఇయర్‌ త్రిష ఫిల్మ్ జర్నీ ప్రత్యేకంగా ఉండబోతుంది. మణిరత్నం తీయబోతున్న ‘పొన్నియన్ సెల్వన్’, మోహన్‌లాల్‌‌తో ఓ మళయాళ సినిమా, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం..వీటన్నింటిలో త్రిషే హీరోయిన్” అని అతను పేర్కొన్నాడు. ఇంతవరకు అంటే ఇది గెస్సింగ్ అనుకోవచ్చు. కానీ అతగాడి ట్వీట్‌కు ఎవర్‌గ్రీన్ బ్యూటీ..అవన్నీ నిజమే అన్నట్టుగా ఓ ఎమోజీని పోస్ట్ చేసింది.

బాలయ్యతో నటించిన ‘లయన్’ ..త్రిష ఆఖరి తెలుగు స్ట్రెయిట్ సినిమా. ఆ తర్వాత ‘నాయకి’ , ‘చీకటిరాజ్యం’.. తెలుగులో రిలీజైనా, అవి అనువాద చిత్రాలే. దీంతో త్రిష రీ ఎంట్రీ విత్ మెగాస్టార్.. ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేస్తోంది. గతంలో చిరుతో కలిసి ‘స్టాలిన్’ మూవీలో ఆడిపాడింది త్రిష.