Trisha Krishnan : విజయ్ను అడిగానని చెప్పండి.. అభిమాని మాటకు త్రిష రియాక్షన్ ఇదే.. వీడియో వైరల్..
ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో త్రిష కృష్ణన్ పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్న ఈ అమ్మడు పేరు ఇటు రాజకీయాల్లోనూ చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇండస్ట్రీలో త్రిష హాట్ టాపిక్ అయ్యింది.

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. 44 ఏళ్ల వయసులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు ఆమె నటించిన లేటేస్ట్ మూవీ కరుప్పు. సూర్య హీరోగా డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ మూవీ మే 15న అడియన్స్ ముందుకు వచ్చింది. ఉదయం నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో కరుప్పు కాగా.. తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో విడుదల చేశారు మేకర్స్. అయితే చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ సినిమా థియేటర్‌లోని స్ట్రీమింగ్ అవుతున్న కరుప్పు సినిమాను చూసేందుకు త్రిష తన సన్నిహితులతో కలిసి వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. సినిమా అనంతరం థియేటర్ నుంచి బయటకు వచ్చి త్రిష తన కారులో కూర్చోగానే అభిమానులు ఫోటోలు, వీడియోలు తీయడానికి ఆమె చుట్టుముట్టారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..
ఈ సమయంలో, కారు దగ్గరకు వచ్చిన ఒక అభిమాని నవ్వుతూ, ‘మీరు కమాండర్‌ను అడిగారని చెప్పండి’ అన్నాడు. ఇది విన్న త్రిష వెంటనే పెద్దగా నవ్వింది. ఆమె నవ్వుతూనే, ‘అవును’ అని సమాధానమిచ్చింది. ఆమె కారులో కూర్చుని ఎవరికో సందేశం పంపుతూ, నిరంతరంగా నవ్వుతున్న వీడియోస్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. ఆ తర్వాత, తన పేరుతో కేకలు వేస్తున్న అభిమానులకు ఆమె చేయి ఊపింది. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..
మే 10న విజయ్ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె అద్భుతమైన నీలం, బంగారు రంగు చీర ధరించి, మల్లెపూలతో అలంకరించుకుని, విజయ్ తల్లి శోభతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆమె విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్, అతని తల్లితో పాటు ముందు వరుసలో కూర్చున్నారు. దీంతో విజయ్, త్రిష స్నేహంపై మరోసారి రూమర్స్ మొదలయ్యాయి.
ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
"Thalapathy ah kettenu sollunga"Trisha replies, "Kandipa" 😅❤️ pic.twitter.com/CLZUTP3QIn
— Deepu (@deepu_drops) May 15, 2026
ఎక్కువ మంది చదివినవి : Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..
