AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే.. దరిద్రం పోయి డబ్బులు రావాలంటే ఇలా చేయండి..

ఇంటిని శుభ్రంగా ఉంచే చీపురును హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం చీపురును సరైన దిశలో ఉంచడం, సరైన రోజున కొనుగోలు చేయడం, కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం.. అలాగే, చీపురుపై అడుగు పెట్టడం, తలకిందులుగా ఉంచడం, సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం వంటి విషయాలపై పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే.. దరిద్రం పోయి డబ్బులు రావాలంటే ఇలా చేయండి..
Broom Vastu Tips
Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2026 | 5:49 PM

Share

సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగించే సాధారణ వస్తువులలో చీపురు ఒకటి. శుభ్రపరచడానికి ఉపయోగించే చీపురు గడ్డి, ప్లాస్టిక్, బిర్చ్ లేదా ఫైబర్ తో తయారు చేస్తారు.. అయితే.. హిందూ మతంలో చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. చీపురునకు సంబంధించిన అనేక నియమాలు గ్రంథాలలో వివరించారు. ఎందుకంటే.. చీపురు.. ఇంట్లో సంపదను, శ్రేయస్సును ప్రభావితం చేస్తుందని.. దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. అవమానించడం, సరైన ప్రదేశంలో పెట్టకపోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఉండదని.. దేవత ఆగ్రహానికి గురై.. దరిద్రం దాపురిస్తుందని పలువరు వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.

వాస్తవానికి ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక సమస్యల నివారణకు వాస్తు శాస్త్రం ఎన్నో విషయాలను వివరిస్తుంది.. ఇంటి వాస్తుతోపాటు.. లక్ష్మీదేవికి ప్రతీకగా భావించే చీపురు విషయంలో తప్పులు చేయకూడదని వాస్తుశాస్త్ర పండితులు సూచిస్తున్నారు. చీపురు ఇంటిని శుభ్రం చేసి చెడును దూరంచేస్తుంది.. అలాంటి చీపురును జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా.. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంటున్నారు.

వాస్తుశాస్త్రం ప్రకారం.. చీపురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి…? పాత చీపురును ఎప్పుడు పారేయాలి..? అనే వివరాలను తెలుసుకుందాం..

చీపురు కొనుగోలు – విసర్జన నియమాలు:

శాస్త్రాల ప్రకారం, మంగళవారం లేదా శనివారం చీపురు కొనడానికి ఉత్తమమైన, పవిత్రమైన రోజులు. ఈ రోజుల్లో చీపురు కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. సంపద వస్తుంది.. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. కృష్ణ పక్షంలో చీపురు కొనడం కూడా మంచిది. అయితే, పాత లేదా చెడ్డ చీపురును గురువారం లేదా శుక్రవారం ఇంటి నుండి బయటకు తీయకూడదు. ఈ రోజుల్లో చీపురు తీసివేస్తే లక్ష్మీదేవి కోపించి ఇంటి నుండి వెళ్ళిపోతుందని, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభించదని నమ్ముతారు.

చీపురు స్థానం – ఇతర నియమాలు:

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో చీపురును దక్షిణ భాగం, వాయువ్యం.. లేదంటే పడమర, నైరుతి దిక్కులో ఉంచాలి.. అలాగే.. చీపురు పడుకోబెట్టి ఉంచాలి.. చీపురును ఇంట్లో ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

చీపురును మంచం కింద అస్సలు ఉంచకూడదు. తలకిందులుగా ఉంచడం అలాగే.. చీపురుపై అడుగు పెట్టడం లేదా దాటడం మంచిది కాదు. సూర్యాస్తమయం తర్వాత చీపురుతో తుడవకూడదు.. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపం తెచ్చుకుని ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్ముతారు. చీపురును ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకోకూడదు. ఈ వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఇంట్లో సంపద, శ్రేయస్సును పొందవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

(నోట్ : ఈ వార్తలో ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించడం జరిగింది.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి..)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్