Viral Photo: సింగర్ అంటే ఎవరు నమ్ముతారు అమ్మాయ్.. హీరోయిన్‌లా ఉంటేనూ.. ఎవరో గుర్తించారా..?
పదులు సంఖ్యలో తెలుగు చిత్రపరిశ్రమలో సింగర్స్ రాణించగలుతున్నారంటే.. బాలు గారు అన్నీ తానై నడిపించిన పాడుతా తీయగా ప్రొగ్రాం పుణ్యమని చెప్పాలి.
Tollywood: తెలుగులో ఇప్పుడు ఎంతోమంది సూపర్ టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. మనవాళ్లు ఇతర భాషల్లో సైతం పాటలు పాడుతున్నారు. గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubrahmanyam) గారు చేసిన కృషి వల్ల మెరికల్లాంటి సింగర్స్ తయారయ్యారు. పదులు సంఖ్యలో తెలుగు చిత్రపరిశ్రమలో సింగర్స్ రాణించగలుతున్నారంటే.. బాలు గారు అన్నీ తానై నడిపించిన ‘పాడుతా తీయగా'(padutha theeyaga) ప్రొగ్రాం పుణ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్పూర్తిలో ప్రజంట్ పలు టీవీ చానల్స్‌లో, ఓటీటీలలో సింగింగ్ కాంపిటేషన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సింగర్‌గా దూసుకుపోతుంది రమ్య బెహరా. ఈ అమ్మాయి గుంటూరు జిల్లా(Guntur District) నరసరావుపేటలో 1994, ఫిబ్రవరి 1 జన్మించింది. పెరిగింది మాత్రం హైదరాబాద్(Hyderabad)లో. రమ్య బెహరా రామాచారి గారి వద్ద సంగీత పాఠాలు నేర్చుకుంది. ఆపై వివిధ పాటల పోటీల్లో పాల్గొని మంచి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది. టీవీ ప్రొగ్రామ్స్‌లో సత్తా చాటింది. దేశ, విదేశీ సంగీత కచేరిల్లో పాల్గొని.. తన గాత్రంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడుకీరవాణి గారి మెప్పు పొంది.. ఎన్నో మంచి పాటలను పాడింది. కీరవాణి రమ్య బెహరాను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వెంగమాంబ మూవీతో ఆమె పాటల ప్రయాణం ప్రారంభమైంది. ఆపై లచ్చిందేవికి ఓ లెక్కుంది, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవతి, క్రాక్, ఆచార్య సినిమాలలో మంచి పాటలు పాడింది. ఈ యువ గాయని ప్రజంట్ కొన్ని కన్నడ, తమిళ్, హిందీ సినిమాలలో కూడా పాడుతుంది.
మెస్మరైజ్ చేసే గాత్రం మాత్రమే కాదు.. మైండ్ బ్లాంక్ చేసే అందం కూడా రమ్య బెహరా సొంతం. అందుకే ఆమెకు యూత్‌లో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. కాగా రమ్య బెహరా చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆమెను చూసిన నెటిజన్లు అసలు గుర్తించలేకపోతున్నారు. ఈమె మన రమ్య బెహరానేనా అని కామెంట్లు పెడుతున్నారు.
View this post on Instagram