Photo Puzzle: మాంచి కిక్కిచ్చే పజిల్.. ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెడితే.. మీ ఐ పవర్ సూపర్బ్
సండే బుక్స్‌లో వచ్చే పద సంపత్తి సంబంధించిన పజిల్స్ ఒక రకమైతే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో పజిల్స్ మరో రకం. ఇవి మీ కళ్లకు పరీక్ష పెడతాయి...
Picture riddle: లైఫే పెద్ద ఛాలెంజ్… మన రోజువారి జీవితంతో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. మనం వాటిని ఎలా తట్టుకుని ముందుకు వెళ్తున్నామనేది ఇంపార్టెంట్. కొందరు ప్రాబ్లం వస్తే కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. మరికొందరు మాత్రం ఓ హైరానా పడిపోతుంటారు. ఆరోగ్య సమస్యల్ని తెచ్చుకుంటారు. మీరు కంగారు పడినంత మాత్రాన వచ్చిన సమస్య పోతుందా..?. లేదు కదా.. అందుకే కూల్‌గా ఆలోచిస్తే సొల్యూషన్ దొరకుతుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టి.. వేసే అడుగులను బట్టి లైఫ్ మారిపోద్ది. ఒక్క 10 నిమిషాలు కూర్చుని మంచిచెడ్డలు ఆలోచిస్తే ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో హ్యాపీ ఫ్యూచర్ సొంతం చేసుకోవచ్చు. అందుకు సెల్ఫ్ కాన్పిడెన్స్, పట్టుదల అవసరం. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నారు చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు పరిష్కరించడానికి రెడీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్.. సండే వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపిస్తే.. దాన్ని సాల్వ్ చేసేవరకు కొందరు నిద్రపోరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా చాలా రకాల పజిల్స్ సర్కులేట్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇవి కళ్లకు పరీక్ష పెడుతున్నాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం ఈజీ టాస్క్ కాదు. ఎంత సేపు ప్రయత్నించినా.. వీడని చిక్కుముడిగానే ఉంటాయి. మీ చూపుల్లో పవర్ ఉంటే వీటిని తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. వీటిని సాల్వ్ చేస్తే.. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఓ అడవిలో తీసినదిగా అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఒక గుడ్లగూబ దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా టఫ్. లేటెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. ఫోకస్ చేసి గమనిస్తే దాన్ని సులభంగా పట్టేయవచ్చు. ఏదో పైపైన చూస్తే మాత్రం దొరకదు. ఎంత చూసిన లాభం లేదు అనుకుంటే దిగువన ఫోటో చూడండి.