Viral: వామ్మో..! ఈ బుజ్జి తల్లి పిల్లి పిల్ల అనుకుని ఇంటికి ఏం తెచ్చిందో తెలిస్తే షాకే..

చిన్నారులు.. పిల్లి పిల్లలు.. కుక్క పిల్లలు కనిపిస్తే.. వాటితో ఆడుకోవడం.. వాటిని ఇంటికి తీసుకురావడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మహారాష్ట్రలోని నాశిక్​లో ఓ చిన్నారి కూడా అలాంటి పనే చేసింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..?

Viral: వామ్మో..! ఈ బుజ్జి తల్లి పిల్లి పిల్ల అనుకుని ఇంటికి ఏం తెచ్చిందో తెలిస్తే షాకే..
పిల్లి అనుకుని ఆ చిన్నారి.. ఏం తీసుకొచ్చిందో తెలుసా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: May 13, 2022 | 3:51 PM

ఆ బుజ్జి తల్లి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. కాసేటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఓ కూనను కూడా తీసుకొచ్చింది.  ఆ కూనను చూసి ఇంట్లోని వాళ్లంతా కంగుతిన్నారు. ఎందుకంటే ఆ చిన్నారి.. పిల్లి పిల్ల అనుకుని చిరుత పులి పిల్లను తీసుకొచ్చింది. అయితే ఆ చిరుత పిల్ల రోజుల వయస్సుది అవ్వడంతో.. ఎవ్వరినీ ఏం చేయలేదు. పులి కూన మాత్రమే ఉంది.. పులి ఆ ప్రాంతంలో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర(maharashtra) మాలేగావ్​(Malegaon)లోని మోర్జార్​ శివరా ప్రాంతంలో జరిగింది. అయితే ఆ కుటుంబ సభ్యులు కాస్త సాహసమే చేశారు. కూన కోసం తల్లి వస్తుందేమో అని.. వారం రోజుల పాటు చిరుత పిల్లను తమ వద్దే ఉంచుకున్నారు.  కానీ చిరుత మాత్రం ఆ ప్రాంతంలో సంచరించిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఫారెస్ట్ డిపార్టె‌మెంట్ వారికి సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వారం రోజులు ఆ చిరుత పిల్లను ఆ చిన్నారి కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా సాకారు.  దానికి రోజూ పాలు పట్టారు. దాదాపు రోజుకు లీటరన్నర మిల్క్ పట్టారట. అయితే  కూన కోసం ఆ ప్రాంతానికి చిరుత ఎప్పుడు వస్తుందో అని.. కుటుంబ సభ్యులు కంగారు పడతుంటే.. ఆ చిట్టి తల్లి.. మాత్రం ఆ చిరుత పిల్లతో సరదాగా ఆడుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ చిన్నారి పేరు చెప్పలేదు కదూ.. చిముకల్య. అయితే చిరుత పిల్లను ఏవైనా పక్షులు తీసుకువచ్చి ఆ ప్రాంతంలో పడేసి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

Kid

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే