KGF Chapter 3 : కేజీఎఫ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. చాఫ్టర్ 3 పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్..
ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. విదుడైన అన్ని భాషల్లో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ ను మొదలు పెడితే.. కేజీఎఫ్ సినిమా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.
ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ లో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. విదుడైన అన్ని భాషల్లో భారీ హిట్ ను సొంతం చేసుకుంది. అదే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్(KGF ) బాహుబలి సినిమా పాన్ ఇండియా జర్ననీని మొదలు పెడితే.. కేజీఎఫ్ సినిమా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. కన్నడ రాక్ స్టార్ యష్(Yash )నటించిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సినిమాతో యష్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ లభించింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. చాఫ్టర్ 1 కంటే చాఫ్టర్ 2 గ్రాండ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. అన్ని రికార్డ్స్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది. కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి చాఫ్టర్ 3 వస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.
కేజీఎఫ్ చాఫ్టర్ 2 చివరిలో చాఫ్టర్ 3 ఉంటుందన్నట్టు హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఆతర్వాత ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. చాఫ్టర్ 3 చేసే ఉదేశ్యం లెదు అన్నట్టు చెప్పుకొచ్చారు. తాజాగా చాఫ్టర్ 3 పై క్లారిటీ ఇచ్చారు కేజీఎఫ్ ప్రొడ్యూసర్. చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ ‘కేజీఎఫ్’ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. కేజీఎఫ్ మూడవ భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభించబోతున్నామంటూ ప్రకటించారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న ‘సలార్’ మూవీని నవంబర్ వరకు పూర్తి చేయబోతున్నాడు. ఆతర్వాత ‘కేజీఎఫ్ 3’ని డిసెంబర్ లో స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు. అలాగే సలార్ ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ నవంబర్ వరకు సినిమాని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ తరువాత డిసెంబర్ నుంచి ‘కేజీఎఫ్ 3′ వర్క్ స్టార్ట్ చేస్తాం. 2023 లో షూటింగ్ మొదలు పెట్టి… 2024లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు విజయ్ కిరగందూర్. దాంతో కేజీఎఫ్ చాఫ్టర్ 3 పై అంచనాలు ఆకాశానికి చేరాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :