Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ ఎడిటర్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ ఎడిటర్‌ పి వెంకటేశ్వరరావు (72) మంగళవారం (జూన్‌ 20) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ

టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ సీనియర్ ఎడిటర్ కన్నుమూత
Senior Film Editor Venkateswara Rao
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2023 | 11:09 AM

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ ఎడిటర్‌ పి వెంకటేశ్వరరావు (72) మంగళవారం (జూన్‌ 20) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తుది శ్వాసవిడిచారు. కాగా వెంకటేశ్వరరావు తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 పైగా సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు. అలనాటి హీరోలతో పలు యాక్షన్‌ సినిమాలు తీసిన దర్శకుడు కెఎస్ఆర్ దాస్‌కు ఆయన స్వయానా మేనల్లుడు. ఎన్టీ రామారావు నటించిన యుగంధర్‌, మొండిమొగుడు పెంకి పెళ్ళాం, కెప్టెన్‌ కృష్ణ, ఇద్దర అసాధ్యులే వంటి పలు హిట్‌ మువీలకు ఆయన ఎడిటర్‌గా చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి, పి వాసు, మంగిమందన్, వైకె నాగేశ్వర రావు, బోయిన సుబ్బారావు వంటి ప్రముఖ దర్శకులతో వెంకటేశ్వర రావు కలిసి పని చేశారు.

వెంటేశ్వరరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్వరరావు అంత్యక్రియలు గురువారం (జూన్‌ 22) చెన్నైలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కళాతపస్వి కె విశ్వనాథ్, నటి జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి, దిగ్గజ గాయని వాణి జయరామ్, యువ హీరో నందమూరి తారక రత్న, సత్యనారాయణ, కృష్ణ, శరత్ కుమార్ తదితరులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.