TANA: అట్టహాసంగా జరగనున్న తానా మహాసభలు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీత హంగామా..
పేన్ ఇండియా మ్యూజికల్ డైరెక్టర్‌గా పేరు పొండటంతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ తానా మహాసభలకు వచ్చేవారికి తనదైన స్టయిల్‌లో సినీసంగీత హంగామాను పంచనున్నారు. ఆలస్యం ఎందుకు వెంటనే మీ పేరును రిజిష్టర్ చేసుకోండి. తానా మహాసభలకు వచ్చి దేవిశ్రీ హంగామాలో పాలుపంచుకోండి.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో అందరికీ నచ్చే ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ సంగీత విభావరులు ఉంటాయి. ఈసారి తానా 23వ మహాసభల్లో టాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత విభావరిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పేన్ ఇండియా మ్యూజికల్ డైరెక్టర్‌గా పేరు పొండటంతోపాటు ఎన్నో అవార్డులను అందుకున్న దేవిశ్రీ ప్రసాద్ తానా మహాసభలకు వచ్చేవారికి తనదైన స్టయిల్‌లో సినీసంగీత హంగామాను పంచనున్నారు. ఆలస్యం ఎందుకు వెంటనే మీ పేరును రిజిష్టర్ చేసుకోండి. తానా మహాసభలకు వచ్చి దేవిశ్రీ హంగామాలో పాలుపంచుకోండి.
ఇక అలాగే ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత నైటింగేల్‌గా పిలిచే పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర తానా మహాసభలకు రానున్నారు. తమ పాటలతో అందరినీ ఆమె పరవశింపజేయనున్నారు. తెలుగు సినిమాల్లో ఎన్నో హిట్ చిత్రాలకు పాటలను పాడిన చిత్ర రాక సినీ ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తున్నడంలో సందేహం లేదు. తానా మహాసభలకు వచ్చి చిత్ర పాటల గానాన్ని వినొచ్చు.




DSP Live Concert on July 8thhttps://t.co/8maD82gbqB#23rdTANAConference#TANAPhiladelphiaConvention#PhiladelphiaTANAConvention#TANA2023#TANAConvention2023#TANAPhiladelphiaConvention2023#TANA#TeluguPride pic.twitter.com/4j8zSNeU3k
— Telugu Association of North America (@TANAsocial) June 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




