Tarun: గుడ్ న్యూస్ చెప్పిన హీరో తరుణ్.. రెండు సినిమాలతో రీ ఎంట్రీకి సిద్ధమైన లవర్ బాయ్

తరుణ్.. ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, ఎలా చెప్పను,

Tarun: గుడ్ న్యూస్ చెప్పిన హీరో తరుణ్.. రెండు సినిమాలతో రీ ఎంట్రీకి సిద్ధమైన లవర్ బాయ్
Tollywood Lover Boy Tarun
Follow us
Basha Shek

|

Updated on: Jul 22, 2024 | 8:50 PM

తరుణ్.. ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ హ్యాండ్సమ్ హీరో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన తరుణ్ నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత నువ్వే నువ్వే, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, ఎలా చెప్పను, నీ మనసు నాకు తెలుసు, నిన్నే ఇష్టపడ్డాను, శశరిఖా పరిణయం వంటి ప్రేమకథల్లో నటించి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిపోయాడు. వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. దీనికి తోడు ఆర్తి అగర్వాల్ తో ప్రేమాయణం కాంట్రవర్సీకి దారి తీసింది. దీంతో ఇండస్ట్రీకి మెల్లగా దూరమై పోయాడీ హ్యాండ్సమ్ హీరో. 2014 లో వేట అనే సినిమాలో కనిపించిన తరుణ్ 2018 లో ఇది నా లవ్ స్టోరీ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు. ఆ తర్వాత సినిమాలకు బాగా దూరమైపోయాడు. దీంతో అతని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించాడు. సీసీఎల్‌(సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌)కి సంబంధించిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ తన ప్రాజెక్టులకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నేను ప్రస్తుతం రెండు సినిమా ప్రాజెక్ట్స్ పై వర్క్ చేస్తున్నాను. అందులో ఒకటి సినిమా కాగా, మరోటి వెబ్‌ సిరీస్‌. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్స్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఒకటి రెండు నెలల్లోనే వాటి అధికారిక అనౌన్స్ మెంట్‌ కూడా ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు తరుణ్. మొత్తానికి త్వరలోనే తన రీ ఎంట్రీ ఉంటుందని క్లారిటీగా చెప్పశాడీ టాలీవుడ్ హీరో. దీంతో అతని అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ టీమ్ కు తరుణ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో సెల‌బ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజ‌న్ – 2 ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

తండ్రితో టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్..

View this post on Instagram

A post shared by Tharun (@actortarun)

చిరంజీవితో తరుణ్ ఫ్యామిలీ..

View this post on Instagram

A post shared by Tharun (@actortarun)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే