AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandini Reddy: క్యాన్సర్‌తో కన్నుమూసిన నందినీ రెడ్డి సోదరి.. కన్నీరుమున్నీరవుతోన్న లేడీ డైరెక్టర్

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆమె సోదరి శాంతి కన్నుమూశారు. ఈ దుర్వార్తను నందినీ రెడ్డినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నందినీ రెడ్డికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Nandini Reddy: క్యాన్సర్‌తో కన్నుమూసిన నందినీ రెడ్డి సోదరి.. కన్నీరుమున్నీరవుతోన్న లేడీ డైరెక్టర్
Nandini Reddy Family
Basha Shek
|

Updated on: Jun 10, 2024 | 8:19 PM

Share

టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతోన్న ఆమె సోదరి శాంతి కన్నుమూశారు. ఈ దుర్వార్తను నందినీ రెడ్డినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు నందినీ రెడ్డికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మన మనసుకు బాగా దగ్గరైన వాళ్లను కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వారిలో ఒకరు దూరం కావడం ఇదే మొదటిసారి. నన్ను తొలిసారిగా అక్క అని పిలిచింది శాంతినే. నాకు బాగా తెలిసినంత వరకు ఆమె చాలా దయ కలిగిన వ్యక్తి. ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు తనకు అత్యంత బలమైన విషయమని నేను గట్టిగా నమ్ముతాను. ఆ బలం, అదే చిరు నవ్వుతోనే శాంతి గత నాలుగు నెలలుగా ఒక పెద్ద యుద్దమే చేస్తోంది. అయితే దురదృష్టవశాత్తూ ఈ పోరాటంలో నా సోదరి ఓడిపోయింది. ఈరోజు ఆమె మరో లోకానికి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఒక బెస్ట్ కుమార్తె, ఒక బెస్ట్ సోదరి, ఒక బెస్ట్ వైఫ్ అలాగే ఒక బెస్ట్ తల్లి ఒక బెస్ట్ ఫ్రెండ్. మరోసారి మనం కలిసే వరకు.. నా డార్లింగ్ చెల్లెలా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం ’ అని తన ఆవేదనకు అక్షర రూప మిచ్చారు నందినీ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల సంతాపం..

ప్రస్తుతం ఈ లేడీ డైరెక్టర్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఆమె ఎలా చనిపోయిందో మాత్రం ఈ పోస్టులో చెప్పలేదు నందినీ రెడ్డి. అయితే క్యాన్సర్ తోనే శాంతి కన్నుమూశారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు శాంతి ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. అలాగే నందినీ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నారు. యాంకర్ ఝాన్సీ, నటుడు ప్రకాశ్ రాజ్, అశ్విన్ కాకుమాను, రైటర్ గోపీ మోహన్, ప్రగ్వా జైశ్వాల్, గాయత్రీ భార్గవి తదితర సినీ ప్రముఖులు అభిమానులు, నెటిజన్లు నందినీ రెడ్డి సోదరి మరణానికి కండోలెన్స్ తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే డైరెక్టర్ నందినీ రెడ్డికి ధైర్యం చెబుతున్నారు.

డైరెక్టర్ నందినీ రెడ్డి ఎమోషనల్ పోస్ట్…

View this post on Instagram

A post shared by Nandini Reddy (@nandureddyy)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.