Tollywood: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలపై టాలీవుడ్ ఫోకస్.. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలదాకా..

యంగ్ జనరేషన్ హీరోలంతా మాస్ యాక్షన్‌ ఇమేజ్‌ కోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మీదే దృష్టి పెడుతున్నారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందున్న హీరో విజయ్ దేవరకొండ.

Tollywood: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీలపై టాలీవుడ్ ఫోకస్.. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలదాకా..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 1:40 PM

యంగ్ జనరేషన్ హీరోలంతా మాస్ యాక్షన్‌ ఇమేజ్‌ కోసం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మీదే దృష్టి పెడుతున్నారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందున్న హీరో విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్ లైగర్‌ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాక్సర్‌గా నటిస్తున్నారు విజయ్‌ దేవరకొండ. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రౌడీ హీరో లుక్‌ నేషనల్‌ లెవల్‌లో దుమ్ము లేపుతోంది.

విజయ్‌తో పాటు మరో యంగ్ హీరో వరుణ్ తేజ్‌ కూడా బాక్సర్ అవతారం ఎత్తుతున్నారు. కిరణ్ కొర్రపాటి అనేకొత్త దర్శకుడితో చేస్తున్న గని సినిమాలో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్‌. ఈ సినిమాలో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్‌లా కనిపించేందుకు చాలా రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారీ మెగా హీరో.

స్టార్ ఇమేజ్‌ ఉన్న హీరోలు మాత్రమే కాదు మీడియం రేంజ్‌ స్టార్లు కూడా స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్ సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న సందీప్‌ కిషన్‌ ఇదే జానర్‌లో సొంత బ్యానర్‌లో సినిమా చేస్తున్నారు. టాలీవుడ్‌లో తొలిసారిగా హాకీ నేపథ్యంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్ ఫిజిక్‌తో కనిపించనున్నారు సందీప్‌.

మరో యంగ్ హీరో నాగ శౌర్య కూడా స్పోర్ట్స్ మూవీకి సై అన్నారు. అయితే రెగ్యులర్ స్టైల్‌లో కాకుండా పాతకాలపు విలువిద్య నేపథ్యంలో లక్ష్య సినిమాను చేస్తున్నారు శౌర్య. ఈ సినిమా కోసం ఎయిట్‌ ప్యాక్ ఫిజిక్‌లో కనిపిస్తున్నారు ఈ యంగ్ హీరో.

మాస్ యాక్షన్‌ హీరో గోపిచంద్‌ కూడా స్పోర్ట్స్‌ డ్రామాకు ఓటేశారు. అయితే డైరెక్ట్‌గా బరిలో దిగి గేమ్ ఆడకపోయినా.. దగ్గరుండి ఆడించే కోచ్‌ అవతారం ఎత్తారు గోపిచంద్‌. ప్రజెంట్ సెట్స్‌ మీద ఉన్న సీటీమార్ సినిమాలో కబడ్డి కోచ్‌గా నటిస్తున్నారు గోపిచంద్‌.

తెలుగు హీరోలు మాత్రమే కాదు మల్టీ లింగ్యువల్ మార్కెట్ ఉన్న స్టార్స్ కూడా స్పోర్ట్స్ డ్రామాల వైపు చూస్తున్నారు. టాలెంటెడ్‌ స్టార్ ఆది పినిశెట్టి ‘క్లాప్’ పేరుతో తెరకెక్కుతున్న బైలింగ్యువల్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..ఈ ఏడాది‌ ట్రిపుల్‌ ధమాకా..

Rana Miheeka 3D Impressions : భ‌ల్లాల‌దేవుడి బ‌హుమానం… అనుబంధాన్ని అచ్చువేయించాడు…