Pooja Hegde: దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అక్కడ అడుగుపెట్టేందుకు ‘బుట్టబొమ్మ’ రెడీ..!

దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అక్కడ అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు సక్సెస్‌ ఫుల్‌ స్టార్‌ పూజా హెగ్డే. తనకు సిల్వర్‌ స్క్రీన్ మీద ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన లాంగ్వేజ్‌లో...

Pooja Hegde: దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అక్కడ అడుగుపెట్టేందుకు 'బుట్టబొమ్మ' రెడీ..!
Follow us

|

Updated on: Jan 21, 2021 | 1:05 PM

Pooja Hegde: దాదాపు పదేళ్ల తరువాత మళ్లీ అక్కడ అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు సక్సెస్‌ ఫుల్‌ స్టార్‌ పూజా హెగ్డే. తనకు సిల్వర్‌ స్క్రీన్ మీద ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన లాంగ్వేజ్‌లో రెండో సినిమా చేయడానికి ఈ బ్యూటీకి.. ఆల్మోస్ట్ పదేళ్ల టైం పట్టింది. త్వరలో ఓ స్టార్ హీరో సినిమాతో కోలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు పూజాహెగ్డే.

2012లో ‘ముగమూడి’ అనే తమిళ సినిమాతో సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు పూజ. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావటంతో మళ్లీ కోలీవుడ్‌ వైపు చూడలేదు. తరువాత వరుసగా తెలుగులో ఆఫర్స్ రావటం, ఇక్కడ స్టార్ ఇమేజ్‌ కూడా అందుకోవటంతో టాలీవుడ్‌కే ఫిక్స్ అయిపోయారు. కానీ ప్రజెంట్‌ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి అదర్‌ లాంగ్వేజెస్‌ నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

కోలీవుడ్ కూడా బుట్టబొమ్మను మరోసారి రమ్మని పిలుస్తోంది. తాజాగా హీరో విజయ్‌ సినిమా కోసం పూజను కాంటాక్ట్ చేశారట మేకర్స్‌. మాస్టర్ తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిని విజయ్‌కి పూజా కూడా వెంటనే ఓకే చెప్పేశారన్నది కోలీవుడ్‌ మీడియా టాక్‌. ఇక్కడి వరకు బాగానే ఉంది గానీ.. ఇప్పటికే టాలీవుడ్… బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అరవింద.. విజయ్‌కి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడాలి.

Also Read:

Pawan Kalyan: పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌..ఈ ఏడాది‌ ట్రిపుల్‌ ధమాకా..

Rana Miheeka 3D Impressions : భ‌ల్లాల‌దేవుడి బ‌హుమానం… అనుబంధాన్ని అచ్చువేయించాడు…