Sonarika : తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తతో కలిసి మెటర్నిటీ ఫోటోషూట్..
తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇప్పుడు అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది. తాను ప్రెగ్నెంట్ అంటూ విషయాన్ని రివీల్ చేస్తూ ఫోటోస్ షేర్ చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ హిందీలో ఎక్కువగా సీరియల్స్ ద్వారా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా దేవాన్ కే దేవ్ మహాదేవ్ సీరియల్లో పార్వతి దేవిగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు సోనారిక. హిందీలో దస్తాన్ ఈ మొహబ్బత్ సలీమ్ అనార్కలీ సీరియల్ లో నటించింది. అలాగే మరో రెండు మూడింటిలోనూ కనిపించి మెప్పించింది. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో హీరోయిన్ గా అలరించినప్పటికీ అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యింది. చివరగా 2022లో హిందుత్వ అనే హిందీ మూవీలో నటించింది.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
ఇదిలా ఉంటే.. 2022లో తన ప్రియుడు, వ్యాపారవేత్త వికాస్ పరశార్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు 2022లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
తాజాగా తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేసింది. దీంతో సోనారిక దంపతులకు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం సోనారిక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..




