ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడు లేకపోతే నేను లేను.. మృణాల్..

13 June 2026

Pic credit - Instagram

Phani Ch

మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.

ఇక మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ నుండి మాస్ మీడియా చదివారు.

ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు.

ఇక హిందీలో ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 2020లో ఠాకూర్ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో మంచి పాత్రలో మెరిశారు.

అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. ఠాకూర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన తూఫాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించారు.

ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. రణ్‌వీర్ సింగ్‌ను తన "లక్కీ చార్మ్" అని అన్నారు. "ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఒక నటిగా ఉన్నానంటే దానికి కారణం ఆయనే" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

ఆ యాడ్ చూసిన తర్వాతే సినీ నిర్మాతలు తనను గుర్తించి అవకాశాలు ఇచ్చారని ఆమె వెల్లడించారు. రణ్‌వీర్ ఎంతో పాజిటివ్ వ్యక్తి అని, ఆయనకు దక్కుతున్న ఈ విజయం పూర్తిగా ఆయన కష్టానికి దక్కిన ఫలితమని చెప్పుకొచ్చారు.