ఒకొక్క సాంగ్‌కు ఎంత తీసుకుంటానంటే.. రెమ్యునరేషన్ గురించి నాగదుర్గ క్రేజీ కామెంట్స్
సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కూడా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే సినిమా సాంగ్స్ కు మించి ఫోక్ సాంగ్స్ పాపులర్ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సాంగ్స్ కోట్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ ఈ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి.

తెలంగాణ జానపద కళారంగంలో యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన తార నాగదుర్గ, తన అద్భుతమైన నృత్యాలు, అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. తిన్న తీరం పడుతా లే వంటి వైరల్ పాటలతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నాగదుర్గ ఆదాయం, ఆమె ఒక పాటకు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. నాగదుర్గ తనదైన ప్రత్యేక శైలిలో జానపద గీతాలకు జీవం పోసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దారేంట పొత్తొండు, నా పేరే ఎల్లమ్మ, ఎర్ర రుమాల్, కాపోల ఇంటికాడ వంటి పాటలతో ఆమె యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధించాయి. ఆమె ప్రదర్శనలు, లుక్స్, డ్యాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఇప్పటికీ బుల్లెట్ బండి ఫేం బండి లక్ష్మణ్ రాసిన పెద్దిరెడ్డి సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇన్నేళ్ల యూట్యూబ్ ప్రయాణంలో ఆమె దాదాపు 300 లకు పైగా పాటలకు నృత్యం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
యూట్యూబ్‌లో విశేష గుర్తింపు పొందిన నాగదుర్గ, ఇప్పుడు సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. కలివాణం అనే తెలుగు సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించింది. అయితే, ఈ సినిమా విడుదల ఇంకా కాలేదు. తెలుగుతో పాటు, తమిళ చిత్రసీమలో కూడా నాగదుర్గ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవిష్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైందని టాక్ వినిపిస్తుంది. గత సంవత్సరం జాబిలమ్మ నీకు అంత కోపమా అనే డబ్బింగ్ చిత్రంతో పవిష్ హీరోగా పరిచయమయ్యారు. పవిష్ నటిస్తున్న కొత్త చిత్రం విజయవంతమైతే, నాగదుర్గకు తమిళంలో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది.
నాగదుర్గ సంపాదన, ఒక పాటకు ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ గురించి తరచుగా చర్చ జరుగుతుంది. ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభంలో అందుకున్న రెమ్యూనరేషన్‌కు, ఇప్పుడు అందుకుంటున్న దానికి తేడా ఉందని ఆమె పేర్కొంది. పాట యొక్క ప్రాముఖ్యత, తన పాత్ర, బృందం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆమె వెల్లడించింది. అంతేకాకుండా, తాను నటించే పాట నచ్చితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని నాగదుర్గ స్పష్టం చేసింది. తన కెరీర్ మొదట్లో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ, ఇప్పుడు ఆమె భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
