Tollywood Heroine: సౌత్‌లో ఫిల్మ్ స్టార్స్‌ను బాగా అభిమానిస్తారు. కొంతమందిని అయితే ఆరాధిస్తారు కూడా. ఫిల్మ్ స్టార్స్‌కు గుడులు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) ట్రెండ్ పెరిగిపోవడంతో.. మూవీ స్టార్స్… ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తమ మూవీ అప్‌డేట్స్‌తో పాటు.. అన్ని విషయాలను పంచుకుంటున్నారు. అంతేకాదు తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. అవి క్షణాల్లో నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ప్రజంట్ ట్రెండింగ్‌లో ఉన్న సాయి పల్లవి(Sai Pallavi), పూజా హెగ్డే(Pooja Hegde), రష్మిక మందన్నా ఇలా చాలామంది హీరోయిన్స్ చైల్డ్‌హుడ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. తాజాగా ఇదే కోవలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ట్రెండ్ అవుతోంది. ఈమె టాలీవుడ్, కోలివుడ్‌లలో మొన్నీమధ్య వరకు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. ఫస్ట్ లాక్డౌన్ అనంతరం పెళ్లి చేసుకున్న ఈ నటి.. ఇటీవల అమ్మ అయ్యింది. ఇప్పటికే మీకు ఆమె ఎవరో క్లారిటీ వచ్చి ఉంటుంది. యస్.. ఆ చిన్నారి మన అందాల చందమామ కాజల్. కెరీర్ మొదలై 15 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది కాజల్. కాగా ఈ వారం రిలీజైన ఆచార్య సినిమాలో కాజల్ నటించింది. కానీ కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు మేకర్స్. సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. ప్రజంట్ లైఫ్‌లోకి బిడ్డ రాకతో కొన్నాళ్లు మూవీస్‌కు బ్రేక్ ఇవ్వాలని కాజల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Also Read: Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. క్షణకాలంలో ఊహించని విషాదం..