వెండితెర పైకి ఛత్రపతి శివాజీ జీవిత కథ.. ఆ పాత్రలో రానా.? హీరో ఎవరంటే

బాలీవుడ్ లోనూ బయోపిక్ లా హంగామా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ చాలా బయోపిక్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే బయోగ్రఫీ సినిమాల తర్వాత హిస్టారికల్ సినిమాల ట్రెండ్ కూడా కొనసాగుతోంది. అక్షయ్ కుమార్ నటించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్', అజయ్ దేవగన్ 'తానాజీ', 'పానిపట్', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్' వంటి సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ఛత్రపతి శివాజీపై సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. 

వెండితెర పైకి ఛత్రపతి శివాజీ జీవిత కథ.. ఆ పాత్రలో రానా.? హీరో ఎవరంటే
Chatrapati Shivaji
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2024 | 8:36 AM

బయోపిక్ సినిమాలో ఈ మధ్యకాలంలో బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది జీవిత కథలతో సినిమాలు తెరకెక్కాయి. అలాగే స్వాతంత్ర సమరయోధుల జీవిత కథల ఆధారంగా పైన కూడా చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో వీరుడి కథ వెండి తెరపైకి రానుందని తెలుస్తోంది. బాలీవుడ్ లోనూ బయోపిక్ లా హంగామా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ చాలా బయోపిక్ సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. అలాగే బయోగ్రఫీ సినిమాల తర్వాత హిస్టారికల్ సినిమాల ట్రెండ్ కూడా కొనసాగుతోంది. అక్షయ్ కుమార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, అజయ్ దేవగన్ ‘తానాజీ’, ‘పానిపట్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ వంటి సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు ఛత్రపతి శివాజీపై సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

‘శివాజీ’ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో టాలీవుడ్  స్టార్ యాక్టర్ నటిస్తాడని అంటున్నారు. ఆ హీరో ఎవరో కాదు దగ్గుబాటి రానా.. అక్షయ్ కుమార్ నటించిన ‘OMG 2’ చిత్రానికి దర్శకత్వం వహించిన అమిత్ రాయ్ శివాజీ పై కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు.  ఇందులో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఛత్రపతి శివాజీ పాత్రను పోషించనున్నారు. వాకో ఫిలింస్ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్‌ని ఎంపిక చేశారు. అయితే ఔరంగజేబ్ పాత్ర కోసం రానాను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

‘బాహుబలి’ సినిమాలో బల్లాలదేవగా అద్భుతంగా రాణించిన రానా దగ్గుబాటిని ఔరంగజేబ్ పాత్రకు అడిగారట. అమిత్ రాయ్, రానా దగ్గుబాటి ఔరంగజేబ్ పాత్రకు సరిపోతారని, ఇప్పటికే రానా దగ్గుబాటితో సినిమా గురించి రెండుసార్లు చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా చేయడానికి రానా ఒప్పుకున్నాడా లేదా అనేది తెలియడం లేదు. రానా ‘బాహుబలి’ తప్ప మరే సినిమాలోనూ విలన్‌గా నటించలేదు. హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే భీమ్లా నాయక్ సినిమాలో సెకండ్ హీరోగా నటించాడు. అయితే బాలీవుడ్ సినిమాల్లో విలన్ పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షాహిద్ కపూర్ గతంలో ‘పద్మావత్’ సినిమాలో రాజా రతన్ సింగ్ గా నటించాడు. ఇప్పుడు ఛత్రపతి శివాజీ పాత్రలో నటించనున్నాడు. గతంలో రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో ‘రంగూన్‌’ అనే సినిమాలో నటించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..