Major Movie: ఆయన గురించి తెలిశాక ఒక సొంత అన్న‌య్య‌ను కోల్పోయాం అనే ఫీలింగ్ వ‌చ్చింది: అడవి శేష్

26/11ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం మేజ‌ర్‌. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివిశేష్ మేజ‌ర్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

Major Movie: ఆయన గురించి తెలిశాక ఒక సొంత అన్న‌య్య‌ను కోల్పోయాం అనే ఫీలింగ్ వ‌చ్చింది: అడవి శేష్
Adivi Sesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 12, 2021 | 11:40 PM

Major Movie: 26/11ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న చిత్రం మేజ‌ర్‌. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివిశేష్ మేజ‌ర్ గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోన్న `మేజర్` చిత్రం జులై2 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన క్యారెక్ట‌ర్ పోస్ట‌ర్‌, ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఎప్రిల్ 12  మేజ‌ర్ మూవీ తెలుగు టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, హిందీ వెర్ష‌న్ టీజ‌ర్‌ను స‌ల్మాన్‌ఖాన్‌, మ‌ళ‌యాల టీజ‌ర్‌ను హీరో పృథ్విరాజ్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఏఎంబి మాల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో.. అడివిశేష్ మాట్లాడుతూ – “2008లో ముంబై ఎటాక్స్ జ‌రిగిన‌ప్పుడు నేను యూఎస్‌లో ఉన్నాను. సందీప్ ఫోటో చూసిన‌ప్పుడు నాకు అన్న‌య్య‌లా ఉన్నారు అనిపించింది. ఒక సొంత అన్న‌య్య‌ను కోల్పోయాం అనే ఫీలింగ్ వ‌చ్చింది. మీరు ఇప్ప‌టికీ ఆయ‌న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చూసిన‌ట్ల‌యితే క‌ళ్లలో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కాని.. ఫేస్‌లో మాత్రం చిన్న స్మైల్ ఉంటుంది. అది న‌న్ను బాగా ఇన్స్‌పైర్ చేసింది. అప్ప‌టినుండి ఆయ‌న‌కు ఫ్యాన్ అయ్యాను. అనురాగ్‌, సాయి వ‌చ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగిన్ప‌పుడు సందీప్ లైఫ్ స్టోరీ ఎందుకు చెప్ప‌కూడ‌దు అని అన్నాను. వారు ఒకే అన్నాక నా ఫ‌స్ట్ ఛాలెంజ్ సందీప్ పేరెంట్స్‌ని ఒప్పించ‌డం. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్‌గానే కాకుండా జెన్యూన్‌గా చేద్దాం అని చాలా క‌ష్ట‌ప‌డి వారిని ఒప్పించాం. ‌ ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయ‌గానే మేజ‌ర్ సందీప్ గారి మ్యూజియంలో యూనిఫామ్ లే అవుట్ ఎలా ఉంటుందో అలాంటి యూనిఫామ్‌లోనే ఫోటోషూట్ చేసి ఎనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ గా రిలీజ్‌చేశాం. మ‌న‌స్పూర్తిగా చేసిన మూవీ కాబ‌ట్టి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది అన్నారు శేష్.

ఇక ఈ సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి. కొంత మంది డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌న్ను అడిగారు ఇది ఏ సెంట‌ర్ ఫిలిమా? లేదా బీసి సెంట‌ర్స్ సినిమానా? అని..వారంద‌రికీ నేను ఒక్క‌టే చెప్ప‌ద‌లుచుకున్నాను, ఇది మ‌నిషికి న‌చ్చే ఫిలిం. మనిషిలోని ప్ర‌తి ఫీలింగ్‌ని చూపించే చిత్ర‌మిది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క సోల్‌ని సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డమే మా ఉద్దేశ్యం. మాకు స‌పోర్ట్ చేస్తున్న మీడియావారికి, మా నిర్మాత‌ల‌కి థ్యాంక్స్‌. సోనీ పిక్చ‌ర్స్ వారి భాగ‌స్వామ్యంతో మా సినిమా ఇంట‌ర్‌నేష‌న‌ల్ లెవ‌ల్‌కి వెళ్లింది. హైద‌రాబాద్‌లో తీయాల‌నుకున్న మా సినిమా ఎనౌన్స్‌మెంట్ వెరైటీ మ్యాగ‌జైన్ హాలీవుడ్ రిపోర్ట‌ర్స్ లో అయింది. ఒక అప్‌క‌మింగ్ యాక్ట‌ర్‌కి అదొక కిక్‌. మా సినిమా టీజ‌ర్ ని మూడు భాష‌ల్లో ముగ్గ‌రు హ్యూజ్ స్టార్స్ లాంచ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. హిందీ టీజ‌ర్ లాంచ్ చేసిన స‌ల్మాన్‌ఖాన్ గారికి, మ‌ళ‌యాలం టీజ‌ర్ రిలీజ్ చేసిన పృథ్విరాజ్‌గారికి థ్యాంక్స్‌. మ‌మ్మ‌ల్ని న‌మ్మి ఈ ప్రాజెక్ట్ కి పూర్తి స‌పోర్ట్ అందించిన న‌మ్ర‌త మేడ‌మ్‌‌, మ‌హేష్ స‌ర్‌కి స్పెష‌ల్ థ్యాంక్స్. వారి గైడెన్స్ ఎప్ప‌టికీ మేం మ‌ర్చిపోలేము.. ఈ సినిమాకి వ‌ర్క్ చేసిన ప్ర‌తి ఒక్క ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ కి ధ‌‌న్య‌వాదాలు“ అన్నారు అడవి శేష్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

`99 సాంగ్స్‌` కోసం రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా చేసిన ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

Wild Dog In OTT: మే మూడోవారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..