Prakash Raj: పవన్ కళ్యాన్ని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించానన్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్…

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "వకీల్ సాబ్" చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. ఈ పాత్ర గురించి, తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో

Prakash Raj: పవన్ కళ్యాన్ని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించానన్న  విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్...
Prakash Raj
Rajeev Rayala

|

Apr 12, 2021 | 11:53 PM

Prakash Raj:  ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” చిత్రంలో లాయర్ నందగోపాల్ అనే కీలక పాత్ర పోషించారు ప్రకాష్ రాజ్. ఈ పాత్ర గురించి, తన కెరీర్ విశేషాలను ప్రకాష్ రాజ్ మీడియాతో పంచుకున్నారు.ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ… ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు గత చిత్రాలను కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నేను పవన్ గారు కలిసి నటించిన బద్రి సినిమాలో నందా పాత్ర అలా వారికి బాగా గుర్తుండిపోయింది. వకీల్ సాబ్ లో నా పాత్రకు నందగోపాల్ అని పెట్టగానే ప్రేక్షకులు బద్రి టైమ్ కు వెళ్లిపోయి కనెక్ట్ అయ్యారు. కావాలనే దర్శకుడు నా క్యారెక్టర్ కు నందా అని పెట్టారు. కథ చెప్పడం కాదు ప్రేక్షకులకు వినోదాన్ని కూడా అందించాలి. నందాజీ, నంద గోపాల్ అని పవన్ గారు నన్ను పిలిచినప్పుడు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు అందుకే ఆ పేరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సంతోషంగా ఉంది అని అన్నారు.

థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఆడియెన్ ఆ సినిమాను తాను ఎంజాయ్ చేశాడా లేదా అనేదే ఆలోచిస్తాడు. ఎంత సందేశాత్మక కథ చూపించినా, ఎంటర్ టైన్ మెంట్ ఇంపార్టెంట్. అందుకే కోర్ట్ రూమ్ డ్రామాను కూడా ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు అన్నారు. పవన్ గారి ఆలోచనలకు చాలా దగ్గరైన కథ ఇది. ఆయనకు చాలా రిలవెంట్ సబ్జెక్ట్. ఆయన కొన్ని సంభాషణలు చెబుతున్నప్పుడు అవి మనసులో నుంచే వచ్చాయి అనిపిస్తుంది. మహిళల గురించి సినిమా చేసినా మనకు సాంగ్స్, ఫైట్స్ కావాలి. పవన్ గారి ఇమేజ్ కు అనుగుణంగా సినిమా చేస్తూనే…అవన్నీ చేర్చారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.  ఒక సినిమాలో నటుడు బాగా నటించాడూ అంటే కథ, సంభాషణలు, సందర్భాలు ఇవన్నీ కుదరాలి. అన్నీ బాగున్నప్పుడు అందులో మా నటన ఎలివేట్ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు మీరు లేకపోతే సినిమా లేదు అనేది అబద్ధం. అలా ఎవరైనా అంటే అది వాళ్ల ప్రేమ అనుకుంటాను. వకీల్ సాబ్ సెట్ కు వస్తే నిజంగా కోర్టుకు వచ్చినట్లే అనిపించేది. ఒక రోజు నేను 9 గంటలకు సెట్ కు వస్తే, పవన్ గారు ఉదయం ఏడున్నర గంటలకే వచ్చారు. పవన్ గారిని అడిగితే నాకు నిద్రపట్టలేదు వచ్చేశాను అన్నారు. యూనిట్ అంతా చర్చించుకునే వాళ్లం సీన్సు గురించి. భాష ఒకటే, భావం ఒకటే ఉండొచ్చు. పింక్ లో అమితాబ్ బచ్చన్ నటించినప్పుడు దాని మీదున్న అంచనాలు వేరు, అజిత్ గారు తమిళంలో చేసినప్పుడు ఆయన ఇమేజ్ కు తగినట్లు చేశారు. అలాగే ఇక్కడ పవన్ గారు మూడేళ్ల తర్వాత సినిమా చేస్తున్నారంటే, ఆయన ఇమేజ్ కు తగిన సినిమా చేయాలి. పవన్ గారి ఆలోచనా విధానానికి తగిన కథే ఇది.   పవన్ గారిని చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పవన్ గారు మాట్లాడుతూ…ప్రకాష్ రాజ్ గారితో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు. పవన్ గారు ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ గారు అలా ఉండాలి అని కోరుకుంటాను.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Major Movie: ఆయన గురించి తెలిశాక ఒక సొంత అన్న‌య్య‌ను కోల్పోయాం అనే ఫీలింగ్ వ‌చ్చింది: అడవి శేష్

సినిమాలు, సేవలే కాదు దోశలు వేయడంలోనూ.. సరిలేరు సోనూసూద్‌‌‌‌‌‌కు ఎవ్వరు.. వైరల్‌‌‌గా మారిన రియల్ హీరో వీడియో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu