సినిమాలు, సేవలే కాదు దోశలు వేయడంలోనూ.. సరిలేరు సోనూసూద్‌‌‌‌‌‌కు ఎవ్వరు.. వైరల్‌‌‌గా మారిన రియల్ హీరో వీడియో..

కరోనా టైంలో ఆపదలో ఉన్న వారందరికీ హెల్ప్‌ చేసి హీరో అయిన సోనుసూద్ ను దేశం మొత్తం ప్రశంసించింది. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచాడు.

  • Rajeev Rayala
  • Publish Date - 11:30 pm, Mon, 12 April 21
సినిమాలు, సేవలే కాదు దోశలు వేయడంలోనూ.. సరిలేరు సోనూసూద్‌‌‌‌‌‌కు ఎవ్వరు.. వైరల్‌‌‌గా మారిన రియల్ హీరో వీడియో..
Sonu Sood

Sonu Sood : కరోనా టైంలో ఆపదలో ఉన్న వారందరికీ హెల్ప్‌ చేసి హీరో అయిన సోనుసూద్ ను దేశం మొత్తం ప్రశంసించింది. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచాడు. షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ సోనూసూద్ ప్రజాసేవ మాత్రం మరిచిపోవడం లేదు. తనను స్ఫూర్తిగా తీసుకుని సేవలు చేస్తున్న వారిని సైతం కలుస్తూ వారికి సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. పేద ప్రజలకు దేవుడిగా మారిన సోనూసూద్‌కు ఏకంగా గుడినే కట్టించారు ఆయన అభిమానులు. సోనూసూద్‌ సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏం అడిగినా ఇచ్చి ఆడుకుంటూ రియల్ హీరో అయ్యాడు. ఇప్పుడు ఓ వీడియోతో మరో సారి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆకట్టుకోవడమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.

అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం వరుస సినిమాలతో సోను చాలా బిజీగా గడుపుతున్నాడు. ఇటు తెలుగులో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. తాజాగా షూటింగ్ గ్యాప్ ‌లో దోశలు వేశాడు ఈ రియల్ హీరో. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో సోను దోశలు వేస్తూ.. యాక్టర్ అవ్వాలంటే దోశలు వేయడం నేర్చుకోవాలి. అప్పుడే ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ ఖర్చు తగ్గుతుందని భావిస్తారు. ఇక నాకు షూటింగ్ లేకున్నా కొంతమంది నన్ను పిలిపించుకొని నాతో దోశలు వేయించుకుంటారు అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు సోను ఇప్పుడు ఈ  వీడియో సోషల్అం మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kumarajan Suicide: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య… ఇండస్ట్రీలో రాణించకపోవడమే కారణమా..?

`99 సాంగ్స్‌` కోసం రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా చేసిన ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

Wild Dog In OTT: మే మూడోవారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..