Kumarajan Suicide: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య… ఇండస్ట్రీలో రాణించకపోవడమే కారణమా..?

Kumarajan Suicide: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌ (35) ఆత్మహత్య చేసుకోవడం కోలివుడ్‌లో విషాదాన్ని నింపింది. కుమారజన్‌.. నమక్కల్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం...

Kumarajan Suicide: తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌ ఆత్మహత్య... ఇండస్ట్రీలో రాణించకపోవడమే కారణమా..?
Kumararaja
Follow us
Subhash Goud

|

Updated on: Apr 12, 2021 | 11:21 PM

Kumarajan Suicide:  తమిళ నటుడు, నిర్మాత కుమారజన్‌ (35) ఆత్మహత్య చేసుకోవడం కోలివుడ్‌లో విషాదాన్ని నింపింది. కుమారజన్‌.. నమక్కల్‌లోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే అతని గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించనట్లు తెలుస్తోంది. ఇతడు సాంతిప్పొమ్‌ అనే సినిమాను నిర్మించడమే కాక అందులో హీరోగా నటించాడు. కానీ ఇది అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో తాను అనుకున్న గుర్తింపు రాకపోవడంతో కొంత కాలంగా నిరాశలో ఉన్నట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం. తాను ఊహించినట్లుగా కెరీర్‌ సంతృప్తికరంగా ముందుకు సాగకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కుమారజన్‌ మృతి పట్ల తమిళ సినీ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.

ఇవీ చదవండి:`99 సాంగ్స్‌` కోసం రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా చేసిన ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

Wild Dog In OTT: మే మూడోవారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..