Wild Dog In OTT: మే మూడోవారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..

Wild Dog In OTT: టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ గా అహిషోర్‌ సాల్మాన్‌ డైరెక్షన్ లో రూపొందిన వైల్డ్ డాగ్ .. మూవీ డిజిటల్ లో ప్రసారం కావడానికి రెడీ అవుతున్నల్టు..

  • Surya Kala
  • Publish Date - 10:04 pm, Mon, 12 April 21
Wild Dog In OTT: మే మూడోవారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..
Wild Dog

Wild Dog In OTT: టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఏజెంట్ గా అహిషోర్‌ సాల్మాన్‌ డైరెక్షన్ లో రూపొందిన వైల్డ్ డాగ్ .. మూవీ డిజిటల్ లో ప్రసారం కావడానికి రెడీ అవుతున్నల్టు తెలుస్తోంది. నాగార్జున ఇందులో ఎన్‌ఐఏ ఏజెంట్‌ విజయ్‌ వర్మగా కనిపించగా సయామీఖేర్‌ రా ఏజెంట్‌గా నటించింది.
ఈ నెల 2న థియేటర్ల రిలీజై మిశ్రమ టాక్ తో నడిచింది. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లెక్స్ లో ఓటీటీ సంస్థ ఇప్పటికే హక్కులు పొందినట్లు వార్తలొస్తున్నాయి. మే మూడోవారంలో డిజిటల్‌ మీడియాలో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంరజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ మూవీలో దియా మీర్జా, అతుల్‌ కుల్‌కర్ణి, అలీ రెజా, అనీష్‌ కురువిళ్ల, ప్రకాష్‌ సుదర్శన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

హైదరాబాద్‌ గోకుల్‌ ఛాట్‌లో ప్రజలంతా పానీపూరి, ఛాట్‌ తింటూ సంతోషంగా గడుపుతున్నారు.. ఒక్కసారిగా భారీ బాంబ్‌ బ్లాస్ట్‌ జరిగింది. రెండు వారాలు గడుస్తోన్నా ఆ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరో నగర పోలీసులు తేల్చలేకపోతున్నారు. దీంతో అధికారులు ఎన్‌ఐఏ సాయం తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఆ బాంబును పేల్చింది ఎవరో తేల్చడానికి ఎన్ఐఏలో ఉన్న ది బెస్ట్‌ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ రంగంలోకి దిగాడు. నాగార్జున హీరోగా తెరకెక్కింది..  ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా.  హైదరాబాద్‌ నగరంలోని కోఠిలో ఉన్న గోకుల్‌ ఛాట్‌లో 2013లో జరిగిన బాంబు దాడిని ఆధారం చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక నాగార్జున వైల్డ్ డాగ్ రిలీజ్ అనంతరం బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ లో పాల్గొనట్లున్నల్టు తెలుస్తోంది. రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌, మౌనీరాయ్‌తో నటిస్తున్న ఈ మూవీలో నాగ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై కీలక సన్నివేశాలను వీరి మీద తెరకెక్కించారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా కనిపించనున్నారు. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బిగ్ బి అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటూ నాగార్జున చూపిస్తోన్న జోరు చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

Also Read:  కరోనా నియంత్ర కోసం అంటూ సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్స్ ధర పెంపు .. ఎంతమేర అంటే..

ముఖం, గెడ్డం దగ్గర కొవ్వు పేరుకుందా.. సింపుల్ చిట్కాలను ఫాలోకండి