AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ముహూర్తం ఖరారు..మెగాస్టార్ సారథ్యంలో సీఎం జగన్‌తో భేటీ కానున్న సినీపెద్దలు

టాలీవుడ్ సమస్యలపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు సినీ పెద్దలు. కరోనా మహమ్మారి కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే.

Tollywood: టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ముహూర్తం ఖరారు..మెగాస్టార్ సారథ్యంలో సీఎం జగన్‌తో భేటీ కానున్న సినీపెద్దలు
Jagan
Rajeev Rayala
| Edited By: |

Updated on: Aug 29, 2021 | 8:08 AM

Share

Tollywood: టాలీవుడ్ సమస్యలపై ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు సినీ పెద్దలు. కరోనా మహమ్మారి కల్లోలంతో సినిమా ఇండస్ట్రీ కుదేలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో రెట్టింపు ఉత్సాహంతో సినిమా ఇండస్ట్రీ పనిచేస్తుంది. పెండింగ్‌లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే చాలా సినిమాలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యాయి కూడా..అయితే కరోనా కారణంగా సినిమా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే. చాలా కలం తర్వాత ఇప్పుడే పెద్ద తెరపై సినిమాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిన్న చిన్న సినిమాలు ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. త్వరలోనే భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో 100 శాతం ఆకుపెన్సీతో థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. అయితే ఆంద్రప్రదేశ్‌లోమాత్రం పరిస్థితి ఇలా లేదు. టిక్కెట్ రేట్ల విషయం, ఆకుపెన్సీ, విద్యుత్ బకాయిల మాఫీ ఇలా పలు సమస్యలు ఉన్నాయి.

ఈ సమస్యలపై చర్చించడానికి సినిమా పెద్దలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అవ్వడనికి సిద్దమయ్యారు. దాని కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం అయ్యి. జగన్‌తో ఏ ఏ సమస్యల గురించి చర్చించాలి, వాటిని పరిష్కారానికి మార్గాలు ఏంటి అనే దాని పై చర్చించారు పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు. ఇక ఇప్పుడు టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. మెగాస్టార్ సారథ్యంలో సెప్టెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు టాలీవుడ్ పెద్దలు. ఈ భేటీలో టిక్కెట్ రేట్ల విషయం, ఆకుపెన్సీ, విద్యుత్ బకాయిల మాఫీ తదితర అంశాల పై చర్చించనున్నారు. మరి ఈ సమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి