Megha Akash : నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా.. నాకు కాబోయేవాడు అలా ఉండాలి అంటుంది ముద్దుగుమ్మ మేఘా
యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అందాల భామ మేఘా ఆకాష్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో..

Megha Akash : యంగ్ హీరో నితిన్ నటించిన లై సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది అందాల భామ మేఘా ఆకాష్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది మేఘా. లై సినిమా తర్వాత మరోసారి నితిన్‌తో చేసింది ఈ చిన్నది. చల్ మోహన్ రంగ అనే సినిమాలో నటించింది మేఘా.. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగులో పెద్దగా కనిపించలేదు. నితిన్ సినిమా తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది ఈ బ్యూటీ. అక్కడ వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి తెలుగులో సినిమాలు చేస్తుంది. లేటెస్టుగా ‘రాజ రాజ చోర’ మూవీతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ. ఇప్పుడు డియర్ మేఘా అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమాకు సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అరుణ్ ఆదిత్ – అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ..ఇంట్రస్టింగ్ విషయలు చెప్పుకొచ్చింది.
ఇటీవలే రాజరాజ చోర సినిమాతో మీముందుకు వచ్చాను.. ఈ సినిమాను ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మరో సినిమా ”డియర్ మేఘ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ‘డియర్ మేఘ’ కథ విన్నప్పుడు చాలా రొమాంటిక్ ఎమోషనల్ లవబుల్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగింది. ఇలాంటి కథలో నటించాలి అనేది నా డ్రీమ్.. అందుకే వెంటనే ఓకే చెప్పా.. అని తెలిపింది. అలాగే అబ్బాయి అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఎన్నో రకాల ప్రేమలుంటాయి అంటుంది మేఘా. ఇక తనకు కాబోయేవాడి గురించి మాట్లాడుతూ.. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్. ఆ తర్వాత షారుక్ ఖాన్ అంటే ఇష్టం ఏర్పడింది. నాకు కాబోయే వాడు మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి అని చెప్పుకొచ్చింది. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని ఇక్కడ చదవండి :




