Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ అప్‌డేట్.. ఆ ఇద్దరికీ క్లీన్ చిట్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ బ్రేకింగ్ అందుతోంది. ఇద్దరు సినీ ప్రముఖులకు ఎఫ్‌ఎస్‌ఎల్ క్లీన్ చిట్ ఇచ్చింది.

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ అప్‌డేట్.. ఆ ఇద్దరికీ క్లీన్ చిట్
Puri Jagannadh
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 18, 2021 | 5:02 PM

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బిగ్ బ్రేకింగ్ అందుతోంది. ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)  దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో తరుణ్‌లకు క్లీన్ చిట్ ఇచ్చింది. పూరి జగన్నాథ్, తరుణ్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లు లేవని ఎఫ్‌ఎస్‌ఎల్ వెల్లడించింది. వీరివురి బ్లడ్, హెయిర్, గోళ్ళ నమూనాలను సేకరించిన ఎఫ్‌ఎస్‌ఎల్.. రిపోర్ట్‌లో డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది. 2017 జులైలో ఎక్సైజ్ కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు సెలబ్రిటీల నుంచి బ్లడ్ , హెయిర్ , గోళ్ళ నమూనాలను ఎ‌ఎఫ్‌ఎల్ సేకరించింది. వారు స్వచ్చందంగా  రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జ్ షీట్ తో పాటు ఈ వివరాలను ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ తాజాగా కోర్టుకు సమర్పించింది. ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ వాంగ్మూలాన్ని కూడా కోర్టుకు సమర్పించింది. మరో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని కెల్విన్‌ను కోర్టు ఆదేశించింది.

Puri Tarun

డ్రగ్స్ కేసులో కొనసాగుతోన్న ఈడీ విచారణ…

డ్రగ్స్ కేసుకు సంబంధించిన లింక్‌లేంటి? మనీ లాండరింగ్‌ లెక్కలేంటి? అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టాలీవుడ్‌ ప్రముఖులను విచారిస్తోంది. ఆగస్ట్‌ 31న ప్రారంభమైన విచారణ.. ఈ నెల 22నతో ముగియనుంది. మొత్తం 12 మందిని విచారించనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే పూరీ జగన్నాథ్ విచారణ ముగియగా.. ఈ నెల 22న తరుణ్ హాజరు కావల్సి ఉంది. ఇంతలోపే FSL రిపోర్ట్ పూరి, తరుణ్‌లకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలియడం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ ఏ విధంగా సాగనుందన్నది ఇంట్రెస్టింట్‌గా మారింది.

Also Read: చిక్కుల్లో సోనూసూద్.. పన్ను ఎగవేతపై ఐటీ శాఖ కీలక ప్రకటన.. షాక్‌లో అభిమానులు

Hyderabad: పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో వధువు జంప్… ట్విస్ట్ ఏంటంటే

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట