Prakash Raj: ‘మా’లో మరో సంచలనం… ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామా

పాతికేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో చీలిక వచ్చేసింది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికలే అందుకు ఆజ్యం పోశాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది.

Prakash Raj: 'మా'లో మరో సంచలనం... ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల మూకుమ్మడి రాజీనామా
Prakasg Raj Atmaa
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 12, 2021 | 6:18 PM

పాతికేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సంచలనం చోటుచేసుకుంది. రీసెంట్‌గా జరిగిన ఎన్నికలే అందుకు ఆజ్యం పోశాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనం చోటుచేసుకుంది.  ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. విష్ణు ఇబ్బందులు ఉండకూడదనే తమ మెంబర్స్ రాజీనామా చేసినట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచి రాజీనామా చేసింది వీరే

శ్రీకాంత్‌ – ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బెనర్జీ – వైస్‌ ప్రెసిడెంట్‌ ఉత్తేజ్‌ – జాయింట్‌ సెక్రటరీ

ఈసీ మెంబర్‌ శివారెడ్డి బ్రహ్మాజీ ప్రభాకర్‌ తనీష్‌ సురేశ్‌ కొండేటి సమీర్‌ సుడిగాలి సుధీర్‌ కౌశిక్

“ఏ సంస్థ అయినా నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళాలంటే, అందరి ఆలోచనలు, ఆచరణలు, ఒకేలా ఉండటం అవసరం. అప్పుడే సంస్థ సజావుగా, ఆరోగ్యం గా, సభ్యుల శ్రేయస్సు దిశగా నడిచే అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో శ్రీ నరేష్ గారు “మా” అధ్యక్షులుగా ఉన్న సమయంలో, తానే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం, అంతా తానే అయ్యి, “మా” కోసం ఏ పనీ జరగనివ్వని స్థితికి తీసుకువచ్చారు, జరిగిన గొప్ప పనులపై కూడా ~రద చల్లారు. ఇపుడు మళ్లీ అదే చరిత్ర పునరావృతం అవుద్దేమో అనే సంశయం తో ఉన్నాం. ఈసారి జరిగిన ఎలక్షన్స్ లో శ్రీవిష్ణు గారి ప్యానల్ నుండి కొందరు, శ్రీ ప్రకాష్ రాజ్ గారి ప్యానెల్ నుండి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మాలో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది, సహజంగా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము అడగకుండా ఉండలేము. అందుకని “మా” సంస్థని శ్రీ విష్ణుగారి ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు మంచి జరగవచ్చు అనే ఆశతో, ఉద్దేశ్యంతో, మేము “మా” పదవులకు మనసా వాచా కర్మణా, రిజైన్ చేస్తున్నాం. అయితే మమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిల ట్టుకోవాల్సిన బాధ్యత మాకుంది. అందువల్ల భవిష్యత్తు లో “మా” లో ఏ అభివృద్ధి జరక్కపోయినా, సంక్షేమ కార్యక్రమాలు జరక్కపోయినా ప్రశ్నిస్తుంటాం” అని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ప్రకటించింది.

MAA కోసమే మా రాజీనామాలు. ఇది ప్రకాష్‌రాజ్‌ టీమ్‌ సూటిగా చెప్పిన మాట. మేం ప్రశ్నించే తత్వం ఉన్నవాళ్లం.. ప్రశ్నిస్తే గొడవలు జరుగుతాయి. అభివృద్ధి, సంక్షేమం ఆగిపోతుంది.. అందుకే మా వాళ్లు రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు ప్రకాష్‌రాజ్. మా.. ఎన్నికల్లో ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి 11 మంది గెలిచారు. వాళ్లంతా రాజీనామా చేసేశారు. రిజైన్‌ చేసినా.. బయటి నుంచి ప్రశ్నిస్తుంటామని స్పష్టంచేశారు.

ఆల్రెడీ.. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్‌రాజ్‌.. ఒక కండిషన్‌ పెట్టారు. భవిష్యత్‌లో.. తెలుగువాళ్లు కానివాళ్లను పోటీకి అనర్హులుగా చేస్తూ బైలాస్‌ మార్చనంటే తాను రాజీనామా వెనక్కు తీసుకుంటానని చెప్పారాయన. కేవలం ఓటు వెయ్యడానికి, ఒకర్ని గెలిపించడానికి తాను మాలో సభ్యుడిగా ఉండలేనని కుండబద్దలు కొట్టారు. ఇక, మా పోలింగ్ సందర్భంగా, కౌంటింగ్‌ సందర్భంగా జరిగిన రచ్చపై కొందరు కన్నీటి పర్యంతం అయ్యారు. మోహన్‌ బాబు తనని బూతులు తిట్టారని, కొట్టబోయారని బెనర్జీ కన్నీరు పెట్టుకున్నారు. తనీష్‌ కూడా మోహన్‌బాబు తనని కొట్టబోయినట్టు చెప్పారు. నరేష్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు ఉత్తేజ్‌. ప్రభాకర్‌ ఇంకాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: సుడిగాలి సుధీర్‌కు, సంపూకు భారీగా ఓట్లు.. రికార్డ్ రేంజ్ విక్టరీ