నువ్వు దేవుడివి సామి..! అప్పుడు బస్సు చార్జీలు ఇచ్చాడని.. స్టార్ అయ్యాక ఏకంగా కారు కొనిచ్చాడు
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది చిన్న చిన్న సినిమాలతో మొదలు పెట్టి స్టార్స్ గా మారారు. చిన్నచిన్న పాత్రలు చేసి హీరోలుగా మారిన వారు, దర్శకులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. పైన కనిపిస్తున్న హీరో, దర్శకుడు కూడా తమ కెరీర్ ను చిన్న సినిమాలతో మొదలు పెట్టారు. ఇప్పుడు స్టార్స్ గా మారిపోయారు.

రీసెంట్ డేస్ లో దర్శకుడికి హీరో కారు గిఫ్ట్ గా ఇవ్వడం, లేదా నిర్మాత హీరోలకు, దర్శకులకు గిఫ్ట్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. సినిమా సక్సెస్ అయితే ఆ సంతోషంలో దర్శకులకు, హీరోలకు నిర్మాతలు కారు గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఇటీవలే హీరో కార్తీ కూడా తన దర్శకుడికి కాస్ట్లీ కారు కొనిచ్చాడు. అయితే ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బస్సు చార్జీలు లేక బాధపడుతున్న ఓ హీరోకు రూ. 200 ఇస్తే ఆ హీరో సక్సెస్ అయిన తర్వాత తనకు కారు కొనిచ్చాడని తెలిపాడు. ఇంతకూ ఆ దర్శకుడు ఎవరు.? బస్ ఛార్జీలకు కూడా డబ్బులు లేక ఇబ్బందిపడ్డ ఆ హీరో ఎవరు.?
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. అందరి కంటే విభిన్నమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం అనే సినిమాతో హీరోగా మారాడు సంపూర్ణేష్. ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత సంపూ క్రేజ్ పెరిగిపోయింది. ఇటీవల సంపూర్ణేష్ సోదర సినిమాలో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
సంపూర్ణేష్ హీరోగా కెరీర్ మొదలు పెట్టె సమయంలో ఆయన ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నాడని తెలిపాడు. సంపూ తిరిగి ఊరికి వెళ్ళడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు అని.. అప్పుడు తన దగ్గర ఉన్న రూ. 500ల్లో ఒక రూ. 200 సంపూకి ఇచ్చేవాడిని అని తెలిపాడు. ఆతర్వాత ఎలాగోలా సినిమా చేశాము.. సంపూకి ఆఫర్స్ వచ్చాయి. క్రేజ్ పెరిగింది. నాకు మాత్రం పెద్దగా ఆఫర్స్ రాలేదు. దాంతో నేను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను నా క్రెడిట్ కార్డ్స్ పెట్టి చిన్న నానో కారు కొనుకున్నా.. అప్పుడు సంపూ తన సినిమా రెమ్యునరేషన్ నుంచి నాకు రూ. 6 లక్షలు పెట్టి కారు కొనిచ్చాడు అని తెలిపాడు సాయి రాజేష్. అలాగే సంపూర్ణేష్ బాబు తనకు 12 లక్షల రూపాయలతో ఇల్లు కొనేందుకు కూడా సహాయం చేశారని కూడా తెలిపాడు. ఈ ఎమోషనల్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








