Puri Jagannadh : ఒకటయ్యింది… పూరి మీదున్న మరో రెండు బరువైన బాధ్యతలు అవేనా?
ఎప్పుడూ కంటెంట్‌ని మాత్రమే నమ్ముకునే పూరి... కొడుకు ఆకాష్ విషయంలో కొత్త దారి వెతుక్కున్నారు. ఎక్కువగా ప్రమోషన్ మీదే ఆధారపడ్డారు.

Puri Jagannadh: ఎప్పుడూ కంటెంట్‌ని మాత్రమే నమ్ముకునే పూరి… కొడుకు ఆకాష్ విషయంలో కొత్త దారి వెతుక్కున్నారు. ఎక్కువగా ప్రమోషన్ మీదే ఆధారపడ్డారు. మేకింగ్ టైమ్ లో డైరెక్టర్ పక్కనే వుండి ఎంతగా ఇన్వాల్వ్ అయ్యారో.. ప్రమోషన్ టైమ్ లో అంతకంటే ఎక్కువే చొరవ చూపారు. ఆకాష్ కెరీర్లో గతంలో ఏ సినిమాకీ చూపనంత ఆసక్తి రొమాంటిక్ మూవీ దగ్గర చూపించి.. వాటీజ్ దిస్ పూరీ అని ఇండస్ట్రీలో గుసగుసలు పుట్టేదాకా శ్రమించారు జగన్నాధుడు. అయితేనేం… ఫైనల్ గా కావాల్సిన కమర్షియల్ రిజల్ట్ రాబట్టుకున్నారు.
రొమాంటిక్ మూవీకి టోటల్ టాలీవుడ్ లో తనకున్న పరిచయాలన్నిటినీ వాడేశారు పూరి. ప్రభాస్ తో ప్రాంక్ ఇంటర్వ్యూ చేయించారు. రాజమౌళిని కూడా వదలకుండా అందరినీ ప్రీమియర్స్ కి పిలిచి ఫస్ట్ రివ్యూస్ చెప్పించుకున్నారు. పూరికి తగిన వారసుడు అనీ, నవతరం తెలుగు సినిమాకు ఆకాష్ కూడా ఒక ఆశాకిరణం అనీ స్టేట్మెంట్స్ ఇప్పించుకున్నారు. కట్ చేస్తే… రిలీజ్ తర్వాత రొమాంటిక్ సినిమా కంటే రొమాంటిక్ ప్రమోషన్ మీదే ఎక్కువ టాక్ నడుస్తోంది.
రెండో తరగతి చదువుతున్నప్పుడే నాన్నతో కలిసి సినిమా జర్నీలో పార్టిసిపేట్ చేశారు ఆకాష్. హీరోగా చరణ్ డెబ్యూ మూవీ చిరుతలో ఆకాష్ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. తర్వాత కూడా చైల్డ్ ఆర్టిస్టుగా అక్కడక్కడా కనిపించారు. మూతిమీద మీసాలొచ్చి హీరోగా ట్రై చేసినప్పుడు మాత్రం మంచి బొమ్మ పడక ఇబ్బంది పడ్డాడు. పూరి రాసి డైరెక్ట్ చేసిన మెహబూబా మూవీతో ఆకాష్ కి లైఫ్ గ్యారంటీ అనుకున్నారు. కానీ అది అడ్డం తిరిగింది.
ఇప్పుడు తన కథ- మాటలతోనే మరోసారి ప్రయత్నించి కొడుక్కి సక్సెస్ ఇచ్చారు పూరి. ఇక ఆకాష్ బండి హైవే మీదకు ఎక్కినట్టే. పెద్దపెద్ద స్టార్లకే తన సినిమాలతో జీవితాన్నిచ్చిన పూరి.. సొంత కొడుకుని మాత్రం నిలబెట్టలేకపోతున్నారు అనే కామెంట్ ని ఇలా కౌంటర్ పడిపోయింది. కాకపోతే.. తమ్ముడు సాయిరాం శంకర్ ని కూడా దార్లో పెడితే… పూరి ‘వారసత్వం’ దాదాపుగా నిలబడ్డట్టే. అటు.. తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ ని విజయవంతం చేసుకుంటే.. పూరి సినిమా యాత్ర సంపూర్ణం అయినట్లే.
(Srihari Raja, ET, TV9)
మరిన్ని ఇక్కడ చదవండి :




