Mahesh Babu: ఆ ఒక్కటి అడక్కు.. మహేష్ బాబుకు రాజమౌళి నుంచి ఆ ఆదేశాలు వెళ్లాయా..?
SSMB29 Update: మామూలుగానే రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత.. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆ సినిమా గురించి బయట మాట్లాడరు. మీడియా ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్ని రకాలుగా అడిగినా కూడా ప్రాజెక్టు గురించి బయటపడరు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్న ఈయన తర్వాత రాజమౌళితో ప్రాజెక్టు కన్ఫర్మ్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది.

మహేష్ బాబు తీరు చూస్తుంటే ఆ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేస్తోంది. ఎందుకంటే ఈయన బయట ఏం మాట్లాడాలన్నా కూడా రాజమౌళి పర్మిషన్ తీసుకోవాలి ఏమో అన్నట్టు ఉంది పరిస్థితి. మామూలుగానే రాజమౌళితో సినిమా కమిట్ అయిన తర్వాత.. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు ఆ సినిమా గురించి బయట మాట్లాడరు. మీడియా ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్ని రకాలుగా అడిగినా కూడా ప్రాజెక్టు గురించి బయటపడరు. ఇప్పుడు మహేష్ బాబు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్న ఈయన తర్వాత రాజమౌళితో ప్రాజెక్టు కన్ఫర్మ్ చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలవుతుంది.
ఇప్పటికే ఈ సినిమా కథా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద విజయేంద్ర ప్రసాద్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఒక ట్రావెలర్ కథ ఇది. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమాగా దీన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి. బడ్జెట్ అంచనా కూడా రూ.500 కోట్లు దాటిపోయింది. లెక్క ఇంకా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో అనేది రాజమౌళి ప్లాన్. చాలా సంవత్సరాల తర్వాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దీని కోసం మహేష్ బాబు కూడా చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు.
అంతేకాదు రాజమౌళి ఎలా మేకోవర్ అవ్వమంటాడో తెలియక ఇప్పటినుంచే దానికోసం సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్. ఒకవైపు త్రివిక్రమ్ సినిమా పూర్తి చేస్తూనే.. మరోవైపు దర్శక ధీరుడు సినిమా కోసం తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉన్నాడు మహేష్ బాబు. ఇది రాజమౌళి సినిమా కోసం సన్నద్ధమేనా అని అడిగితే.. అలాంటిదేమీ లేదు తను రోజు జిమ్ చేస్తాను అని సమాధానం చెబుతున్నాడు. మరోవైపు తాజాగా చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన మహేష్ బాబును రాజమౌళి సినిమా గురించి అడిగారు మీడియా మిత్రులు. ఒక ఓపెనింగ్ కు సతీ సమేతంగా హాజరయ్యాడు మహేష్ బాబు. అందులోనే సూపర్ స్టార్ ను జక్కన్న సినిమా ముచ్చట్లు చెప్పాలంటూ కోరారు. దానికి మహేష్ నవ్వుతూ చెప్తాం సార్ అని సమాధానం చెప్పాడు. ఆ ఒక్క ముక్క తప్ప రాజమౌళి సినిమా గురించి మరో ముక్క మాట్లాడలేదు మహేష్.
ఇంకా చెప్పాలంటే ఆయనకు స్టోరీ నరేషన్ కూడా కాలేదని తెలుస్తోంది. ఒక మంచి రోజు చూసుకుని మహేష్ బాబుకు కథ చెప్పాలని చూస్తున్నాడు రాజమౌళి. గతంలో ట్రిపుల్ ఆర్ సినిమా ఓకే చేసినప్పుడు కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కథ చెప్పలేదు రాజమౌళి. ఆయనపై ఉన్న నమ్మకంతో వాళ్లు కూడా అడగలేదు. ఇప్పుడు మహేష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అందుకే జక్కన్న సినిమా గురించి ఏం అడిగినా కూడా మహేష్ ఏమీ మాట్లాడడం లేదు. నవంబర్ చివరి నాటికి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. గుంటూరు కారం అయిపోయిన తర్వాతే రాజమౌళి సినిమాపై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు మహేష్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2024 ఆగస్టు తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2026 లో సినిమా విడుదల కానుంది. నిజం చెప్పాలంటే ఆఫ్రికన్ నేపథ్యం అనేది మినహాయిస్తే మహేష్ బాబుకు కూడా ఈ సినిమా కథ విషయంలో పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. ఒకసారి నరేషన్ ఇస్తే అప్పుడు సినిమా గురించి మహేష్ కు కూడా క్లారిటీ వస్తుంది. అప్పటివరకు ఆయన ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి సినిమా గురించి మాట్లాడమంటే చెప్తాం సార్ అనే సమాధానం తప్ప ఇంకేమీ రాదు.