Tollywood: ఇకపై సాయినాథునికే నా జీవితం అంకితం.. టాలీవుడ్ నటి సంచలన నిర్ణయం
మూడేళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చింది. ఛైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ సహాయక నటిగానూ మెప్పిస్తోంది. అయితే తాజాగా ఈ టాలీవుడ్ నటి ఒక సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఏ రంగంలోనైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ యాక్టింగ్ కు అలాంటివేవీ ఉండవు. అందుకే అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటులు ఏడు పదుల వయసులోనూ సినిమాలు చేస్తున్నారు. ఒక బిగ్ బీనే కాదు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తాము కడవరకు నటిస్తూనే ఉంటామని చెబుతుంటారు. కొందరు మాత్రమే సినిమా అవకాశాలు వస్తున్నా వద్దని చెబుతూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటి తులసి కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘అమ్మ’ పాత్రకుల కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఆమె సంచలన ప్రకటన చేసింది. ఇక సినిమాలు చేయనంటూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ‘షిరిడీ దర్షనం కొనసాగిస్తూ డిసెంబర్ 31న మరోసారి దర్శనానికి వెళ్తున్నాను. అయితే దీనితో నటన నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇకపై సాయినాధతో ప్రశాంతంగా నా ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటున్నా. నా ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవిస్తారని కోరుకుంటున్నా. జీవితాన్ని నేర్చుకోవడంలో నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది తులసి.
ప్రస్తుతం తులసి పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆమె నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు షాక్ కు గురువుతున్నారు. కాగా తులసి మూడేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బాలనటిగా తెలుగు, తమిళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. ఇదే క్రమంలో సినిమాలు చేస్తుండగానే కన్నడ దర్శకుడు శివమణిని పెళ్లి చేసుకుంది. దీని తర్వాత కొన్నాళ్ల పాటు నటనకు విరామం ఇచ్చారామె. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రలతో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. ప్రభాస్, రామ్ పోతినేని, అల్లు అర్జున్ ఇలా ఎందరో హీరోలకు తల్లిగా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ఆంధ్రా కింగ్ తాలుకా మూవీతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తుంది. వీటితో పాటు పలు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే ఇంతలోనే నటనకు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు సంచలనం నిర్ణయం తీసుకుంది తులసి.
తులసి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
తులసి లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








